సింహాచల దేవస్థానం (శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ ఆలయం) చేరుకొనే మార్గాలు – వెళ్లవలసిన సమయాలు
శ్రీమహావిష్ణువు యొక్క నాలుగవ అవతారమైనటువంటి వరాహరూపంలో స్వామివారు సింహాచలం క్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిగా దర్శనమిస్తారు. ఈ మహా క్షేత్రం విశాఖపట్టణం నగరంకు సమీపంలో ఉన్నది.
సింహాచలం ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం, ఏమిటి?
సమయంతో నిమిత్తం లేకుండా, సంవత్సరంలో ఏ సమయంలోనైనా సింహాచలం ఆలయంలో నరసింహ స్వామి వారిని దర్శించి అనుగ్రహాన్ని పొందవచ్చు. అయితే అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది అంటే కాకుండా ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ నుండి 25 డిగ్రీల సెల్సియస్ఈ ఉంటుంది కాబట్టి సింహాచలం ను ఈ నెలలలో సందర్శించడం సాధారణంగా ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. అంతే కాకుండా ఈ సమయం పిల్లలకు, పెద్దలకు అనువుగా ఉంటుంది.
సింహాసింహాచల దేవస్థానం చేరుకొనే మార్గాలు ఏమిటి?
విశాఖపట్నం నుంచి సుమారుగా 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ సింహాచల లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానాన్ని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి అయితే పరిసర ప్రాంతంలో ఉండే ప్రజలు సాధారణంగా సిటీ బస్సు ఆటో మరియు సైకిల్ ద్వారా దేవాలయాన్ని చేరుకుంటారు దూర ప్రాంతం వారు బస్సు రైలు మరియు విమాన మార్గాలలో కూడా ఈ యొక్క క్షేత్రాన్ని చేరుకోవచ్చు.
రవాణా సదుపాయం:
విశాఖపట్నం ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా విశాఖపట్నం బస్టాండ్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి సమీపంలో ఐదు కిలోమీటర్ల దూరంలో గోపాలపట్నం వద్ద సింహాచలం రైల్వే స్టేషన్ ఉన్నది. ఆ గోపాలపట్నం రైల్వే స్టేషన్ నుంచి ప్రతినిత్యం అనేక సంఖ్యలో ప్రైవేటు క్యాబులు ఆటోలు ఆర్టీసీ బస్సుల రవాణా సదుపాయం ఉన్నది. సింహాచలం కొండ నుంచి పైకి మాత్రం సింహాచలం దేవస్థానం వారి యొక్క ప్రత్యేకమైనటువంటి వాహన సదుపాయం ఉంటుంది. సొంతవాహనంలో వెళ్లాలి అనుకునేవారు టోల్ రుసుము చెల్లించి తమ యొక్క కారు లేదా స్కూటర్ వాహనాన్ని పైకి తీసుకు వెళ్ళవచ్చు. పైకి చేరుకునేందుకు దేవస్థానం వారు ప్రతి 15 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తెచ్చారు అయితే చందనోత్సవం(అక్షయ తృతీయ), గిరిప్రదక్షిణ, ముక్కోటి ఏకాదశి, మరియు స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ సర్వీసులు మరియు అధికంగా నడుపుతారు. వృద్ధులు, వికలాంగుల కోసం ఆలయం యొక్క గాలిగోపురం పక్కన లిఫ్ట్ సదుపాయం కూడా ఉన్నది.
విమాన మార్గం ద్వారా సింహాచలం ఎలా చేరుకోవాలి?
సింహాచలాన్ని విమానం మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు. అయితే సింహాచలం కు సమీపంలో ఉన్నటువంటి విశాఖపట్నం మహానగరం యొక్క ఎయిర్పోర్ట్ వద్ద దిగవలసి ఉంటుంది. భారతదేశంలో అన్ని ప్రధాన నగరాల నుంచి నేరుగా విశాఖపట్నం మహానగరం చేరుకోవడానికి ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఏషియా వంటి విమానాల సదుపాయం ఉన్నది. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం సింగపూర్ దుబాయ్ మరియు కౌలాలంపూర్ నుంచి కూడా విశాఖపట్నం కి విమాన మార్గాలు ఉన్నాయి. అక్కడ నుంచి నేరుగా సింహాచల క్షేత్రం రావచ్చు.
రైలు మార్గం ద్వారా సింహాచలం ఎలా చేరుకోవాలి?
విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి నేరుగా బయలుదేరినట్లయితే 6a బస్సు నెంబర్ ద్వారా సింహాచలం చేరుకోవచ్చు. లేనిపక్షంలో విశాఖపట్నంలో ఆగ్రో కార్ రెంటేడ్ క్యాబ్ సదుపాయం నుంచి ప్రైవేటు టాక్సీ కూడా బుక్ చేసుకుని రావచ్చు. అదే విధంగా సింహాచలం దగ్గర ఉన్నటువంటి గోపాలపట్నం రైల్వే స్టేషన్ దగ్గర దిగి కూడా సింహాచలం దేవస్థానాన్ని చేరుకోవచ్చు. అలాగే ముంబై హైదరాబాద్ చెన్నై బెంగళూరు కలకత్తా ఢిల్లీ పూనే అలహాబాద్ వంటి సుదూర ప్రాంతాల నుంచి నేరుగా విశాఖపట్నంలో దిగి అక్కడ నుంచి కూడా సింహాచలాన్ని చేరుకోవచ్చు.
బస్సు మార్గం ద్వారా సింహాచలం ఎలా చేరుకోవాలి?
ఆంధ్రప్రదేశ్ లో మూడవ అతిపెద్ద బస్టాండ్ కాంప్లెక్స్ గా వైజాగ్ లోని ద్వారకా బస్టాండ్ కాంప్లెక్స్ ను పిలుస్తారు. ఈ కాంప్లెక్స్ నుంచి ప్రభుత్వం వారు ప్రతిరోజు సింహాచలం ఆలయానికి షటిల్ సర్వీసులు నడుపుతూ ఉంటారు. అయితే సులభంగా సింహాచలాన్ని చేరుకోవడానికి 6a లేదా 40వ నెంబర్ని పట్టుకుని సింహాచల క్షేత్రాన్ని చేరుకోవచ్చు. అంతేకాకుండా గాజువాక సమీపంలో వారందరికీ స్థానికంగా ఉండేటువంటి గవర్నమెంట్ బస్సు నెంబరు 55 అదేవిధంగా, మద్దిలపాలెం నుంచి సింహాచలం 540 బస్సు నెంబర్ ని పట్టుకొని కూడా సింహాద్రి అప్పన్న చేరుకోవచ్చు.