సహజంగా చాలామందికి నిద్రపోయినపుడు కలలో(స్వప్నం లో) అనేక రకములైన సన్నివేశాలు మెదులుతూ ఉంటాయి. కొందరికి నిత్యజీవితంలో ఈ పనిని మనము ఎప్పుడో చేసామే లేదా ఇదేదో జరగబోతోందే అని అనిపిస్తుంటుంది. మరికొందరికి తమకు జరిగే సంఘటన యదార్ధంగా కలలో వచ్చినదిగా ఉంటాయి.
అయితే మనకు కలలో భవిష్యత్తును గుర్తించు శక్తి కోసం ఏమిచేయాలి?
దీనికోసం శంకరభగవత్పాదాచార్యులచే రచించబడిన సౌందర్యలహరిలోని 40వ శ్లోకమును పఠించాలి.
కలలో భవిష్యత్తును గుర్తించు శక్తి కోసం పఠించవలసిన శ్లోకం:
తటిత్త్వంతం శక్త్యా తిమిరపరిపంథిఫురణయా
స్ఫురన్నానారత్నాభరణపరిణద్ధేంద్రధనుషమ్ |
తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణమ్
నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనమ్ ||
భావం:
ఓ జగన్మాతా – మణిపూర చక్రమును ఆధారముగా చేసుకొని, అజ్ఞ్యానము అను చీకట్లను తొలగించు మొరములతో – రత్నాభరణములతో మెరియు ఇంద్రధనుస్సులా శివుని తేజస్సుతోతపింపచేయబడి ముల్లోకములను తడుపు అనిర్వాచ్యమగు మేఘమును సేవింతును.
పై శ్లోకమును గురుముఖంగా ఉపదేశం తీసుకోని రోజుకి వెయ్యి సార్లు చప్పున 45రోజులు జపమును చేయవలెను.
సేకరణ: https://www.panditforpooja.com/blog/how-to-predict-the-future-by-dreams/
1 Comment. Leave new
Naku ee site chala baga nachindhi