రథసప్తమి సూర్యనారాయణ స్వామి పూజను ఇంట్లో ఏ విధంగా ఆచరించాలి

Loading

how-to-perform-ratha-saptami-surya-puja-at-home

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం 2024 మాఘమాస శుద్ధ సప్తమి రథసప్తమి.

ప్రత్యక్ష దైవమైన, శుభకరుడైన సూర్యనారాయణుని యొక్క జయంతిని సూర్యజయంతి లేదా రథసప్తమి పండుగగా మాఘమాస శుద్ధ సప్తమినాడు జరుపుకుంటారు. ఈ సూర్యజయంతి రోజున సూర్యోదయ సమయమందు ఆకాశంలోని గ్రహ నక్షత్ర సన్నివేసం రథం ఆకారంలో ఉండుట చేత ఈ రోజుకి రథసప్తమి అని పేరు వచ్చింది.

జిల్లేడు స్నానం ఏవిధంగా చేయాలి:

ఈ విశేషమైన పుణ్యదనమున అర్కః అను నామము కలిగిన సూర్యనారాయణునికి ప్రీతికరమైన శ్వేత అర్కపత్రముల(తెల్ల జిల్లేడు ఆకుల) కు రంధ్రం చేసి, ఆ రంధ్రంలో రేగిపండు ఉంచి శిరస్సుపై, భుజములపై, హృదయంపై ఉంచి శిరస్నానం చేయవలెను. అదేవిధంగా రంధ్రం చేసిన జిల్లేడు ఆకు మధ్యనుంచి సూర్యుని దర్శనం చేసుకొని నమస్కరించవలెను.

రథసప్తమి పొంగలి చేయు విధానం:

స్త్రీలు ఈ రోజు చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడు కాయలతో వివిధ ఫల, పుష్పాలను సేకరించి, సంక్రాంతి గొబ్బెమ్మలు పిడకలుగా అయినవి తెచ్చి పాలదాలిగా తులసికోట వద్ద అమర్చుకొని సూర్యునికి ఎదురుగా ఆవుపాలను పొంగించి, పొంగలి చేయవలెను. తదుపరి సూర్యనారాయణ స్వామి షోడశోపచార పూజ పూర్తి చేసి, పొంగలిని చిక్కుడు ఆకులయందు ఉంచి సూర్యదేవునికి ప్రసాదంగా నివేదించాలి.

ఈ విధంగా సూర్య ఆరాధన చేయుట చేత ఆయురాగ్య ఐశ్వర్యాలతో పాటుగా వంశ వృద్ధి చేకూరుతుంది అని ప్రఘాఢ విశ్వాసం.