అశ్వత్థ వృక్షం ను ఎలా పూజించాలి?

Loading

aswatha tree

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణీ!
అగ్రత శ్శివ రూపాయ వృక్ష రాజాయతే నమః!!

  • అశ్వత్థ వృక్షం త్రిమూర్తి స్వరూప, అంతే కాకుండా అశ్వత్థ వృక్షం సర్వదేవతా స్వరూపం.
  • ఈ వృక్షమును ఒక్క శనివారము మాత్రమే ముట్టుకోవచ్చును.
  • అమావాస్య  నాడు ఈ అశ్వత్థ వృక్షానికి శక్తి కొలది అనగా 21, 108 ప్రదక్షిణలు చేసి పూజించిన సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది.
  • వారణాసిలోని కపిల తీర్ధము నందు లేదా చంద్ర కూపమునందు తిలతర్పణ శ్రాద్ధాదులు నిర్వహించవలెనని కాశీఖండము నందు చెప్పబడినది.
  • విష్ణు సహస్ర నామం పఠిస్తూ ప్రదక్షిణ చేయవచ్చు.
  • మౌనంగా ప్రదక్షిణ చేస్తే అమిత ఫలం లభిస్తుంది.
  • ఉదక కుంభం(నీళ్ళ చెంబు) తీసుకొని గర్భిణీ స్త్రీలా మందగతితో ప్రదక్షిణ చేసినచో అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది.