- భోజనం ఏవిధంగా చేయాలి?
- చాలామంది భోజనం తినేటప్పుడు చేసే తప్పులేమిటి?
- బఫే పద్ధతిలో(చేతిలో పళ్ళెం పట్టుకు తినుట) భోజనం చేస్తున్నారా?
- అన్నం తినేటప్పుడు ఏ పాత్రలో పెట్టుకొని తింటే ఆరోగ్యకరం?
- పిల్లలకి, వయసు పైబడిన వారికి ఏ ఆహరం మంచిది?
ఈ సమాచారం చాలామందికి హాస్యాస్పదంగా (నవ్వుగా) అనిపించవచ్చు. కానీ భోజనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలను పాటించాలి, ఎందుకంటే మనిషి శరీరాన్ని నిలబెట్టే పదార్థం భోజనం(అన్నం) మాత్రమే.
భోజనం ఏవిధంగా చేయాలి?
భోజనం చేసేటప్పుడు కాళ్ళూ, చేతులు కడుక్కొని పరిశుభ్రమైన ప్రదేశంలో కూర్చుని తినాలి. కంచంలో పెట్టుకొని తినే సమయంలో అన్నం కింద పడకుండా, వేళ్ళకి అంటుకున్న అన్నాన్ని విదల్చకుండా తినాలి. ముద్దలను ఎగరవేయకుండా, కంచం చప్పుడు చేయకుండా తినాలి. భోజనసమయంలో ఎడమ చేతిని నేలమీద ఆన్చి తినడం, ఒళ్ళు విరిచుకోవడం, ఊగుతూ తినడం చేయరాదు.
చాలామంది భోజనం తినేటప్పుడు చేసే తప్పులేమిటి?
కొందరు కంచాన్ని ఒళ్లో పెట్టుకొని తింటారు. అలాగే పెండ్లిళ్ళలో, శుభకార్యాలలో, హోటళ్ళలో పళ్లాన్ని చేతితో పట్టుకొని (బఫే భోజనం)తింటారు. అలా ఎన్నడూ తినకూడదు. పరబ్రహ్మంగా భావించే అన్నాన్ని(భోజనం) తినేటపుడు కనీస ధర్మాన్ని పాటించాలి.
అన్నం తినేటప్పుడు ఏ పాత్రలో పెట్టుకొని తింటే ఆరోగ్యకరం?
- ఫాస్ట్ ఫుడ్స్ వద్ద చీకట్లో కనిపించని ఏదోక పాత్రలలో తింటే అది శరీరానికి వంటపట్టదు.
- అరటి ఆకులో తినడం చాలా మంచిది. బలం, ఆరోగ్యం, బుద్ధిబలం పెరుగుతాయి.
- స్టీల్ కంచాల్లో తింటే రక్తం శరీరానికి పడుతుంది. జాండిస్‌ను నివారిస్తుంది.
- కంచు కంచంలో పెట్టికొని తింటే రక్తపోటు(బీపీ) తగ్గుతుంది.
- ఇత్తడి కంచంలో అన్నం తింటే వేడిచేస్తుంది.
- వెండికంచంలో చేసే భోజనం వల్ల అన్నం త్వరగా జీర్ణమవుతుంది, కంటి చూపుకు మంచిదై, ఆయుష్షుకు హితకరమౌతుంది.
- బంగారు పళ్ళెంలో అన్నంతింటే అది హృదయానికి మంచిది.
- మట్టిపాత్రలలో భోజనం తింటే దరిద్రము కలుగుతుంది కావున మట్టి పాత్రలలో తినడం నిషిద్ధం.
చిన్న పిల్లలకి, వయసు పైబడిన వారికి ఏ ఆహరం మంచిది?
చిన్న పిల్లలకి, అన్నం పెట్టేముందు మొదటి ముద్దలో పేరిన నెయ్యి, చిటికెడు వాము కలిపి పెట్టడంవల్ల తెలివితేటలు పెరుగుతాయి. బియ్యం, పెసరపప్పు, మిరియాలు, కొంచెం నెయ్యి కలిపి వండిన అన్నాన్ని పులగం అంటారు. ఇది వయస్సు పైబడిన వారికి ఔషధంగా పనిచేస్తుంది. పులగం చాలా మంచిది. పులగంలో కొంచెం ఉప్పు చేర్చి తినడం వల్ల నడి వయస్సు వారికి శక్తి లభిస్తుంది.
సేకరణ: https://www.panditforpooja.com/blog/how-to-eat-food-properly/
2 Comments. Leave new
"మితముగా తింటే అది ఆహారము , అమితముగా తింటే అదే హాలాహలము". "హిత భుక్ , మిత భుక్ "
మంచి మాట చెప్పారు వేంకట రామయ్య గారు