మీరు శివాలయంకి వెళ్ళినపుడు అన్ని ఆలయాలకి చేసిన విధంగానే ప్రదక్షిణ చేస్తున్నారా? ఇకపై అలా చేయకండి…
శివాలయంలో చేసే ప్రదక్షిణ, అన్ని దేవాలయాలలో చేసే ప్రదక్షిణకి భిన్నంగా ఉంటుంది. ఏ గుడిలోకి వెళ్ళినా సర్వ సాధారణంగా ప్రదక్షిణ చేస్తారు. కానీ శివాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇతర దేవాలయాలలో చేసిన విధంగా ఈశ్వరుని దేవాలయంలో ప్రదక్షిణ చేయకూడదు. శివాలయాల్లో ఏ విధంగా ప్రదక్షిణ చేయాలో లింగ పురాణం స్పష్టంగా వివరించింది. శివాలయంలో చేసే ప్రదక్షిణని చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణ అంటారు. ఈ చండీ ప్రదక్షిణం చేయడం వలన ఎలాంటి ఫలితాలు పొందవచ్చో పురాణాల్లో వివరంగా పేర్కొన్నారు.
లింగ పురాణం శివాలయంలో చేయవలసిన ప్రదక్షిణ గూర్చి ఈవిధంగా చెబుతోంది…
వృషంచండ వృషం చైవ సోమ సూత్రం పునర్వృషం|
చండంచ సోమ సూత్రంచ పునశ్చండం పునర్వృషం!|
శివ ప్రదక్షిణే చైవ సోమ సూత్రం నలంఘయేత్|
లంఘనా త్సోమ సూత్రస్య నరకే పతనం ధృవం||
శివాలయంలో ధ్వజస్థంభం వద్ద ప్రదక్షిణ ప్రారంభించి, ధ్వజస్థంభం నుండి చండిశ్వరుని వరకూ ప్రదక్షిణ చేసి చండిశ్వరుడిని దర్శించుకొని అక్కడ నుండి మళ్లీ వెనక్కి తిరిగి ధ్వజస్థంభం దగ్గరకు వచ్చి ఒక్క క్షణం ఆగి మరలా ప్రదక్షిణ మొదలు పెట్టి సోమ సూత్రం (అభిషేక జలం బయటకు పోవు దారి) వరకు వెళ్లి, తిరిగి ధ్వజస్థంభం దగ్గరకు రావాలి. అలా వస్తే ఒక్క ప్రదక్షిణ పూర్తి అవుతుంది. వెనుదిరిగి నందిశ్వరుని చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్లు. ఈవిదం చేసే ప్రదక్షినకే చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని పేరు. శివ ప్రదక్షిణలో సోమసూత్రం దాటరాదు ఎందుకంటే ఆయనకు అభిషేకం చేసిన జలం సోమసూత్రం నుండి పోతుంది. అంతేకాక అక్కడ ప్రమధ గణాలు కొలువై ఉంటారు . అందుకే వారిని దాటితే శివుని కోపానికి గురి అవుతారు. ఈ విధంగా చేసే ఇలా చేసే ప్రదక్షిణం సాధారణంగా చేసే పది వేల ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడింది. ఇలా మూడు ప్రదక్షిణలు చేయాలి. అయితే నందికి శివుని కి మధ్యలో నడవకూడదు ఎందుకంటే సదా ఆయన చూపులు శివుని మీదే ఉంటాయి .
అలాగే చాలా మంది ఏ దేవాలయంలో అయిన తెలియక చేసే పొరపాటు గర్భగుడి వెనుక భాగాన్ని తాకి నమస్కారం చేస్తారు. అలా చేయకూడదు. గర్భగుడి వెనుక భాగంలో రాక్షసులు ఉంటారు వారిని నిద్ర లేపినట్లు అవుతుంది తాకితే.
మరో విషయం ఏమిటంటే… విగ్రహనికి ఎదురుగా నిలబడి ఏ దేవుడు లేదా దేవత దర్శనం చేసుకోకూడదు. ఎందుకంటే విగ్రహం నుండి వెలువడే శక్తి తరంగాలు నేరుగా మన మీద పడతాయి. వాటిని వాటి శక్తి మనం భరించలేం కనుక ప్రక్కన నిలబడి దర్శనం చేసుకోవాలని పెద్దలు చెప్తారు .
3 Comments. Leave new
Thoorpu dhikkuna nilabadi siva ki pradakshina eatunundi modhalupettali
ఈ విధంగా చేసే ela చేసే ప్రదక్షిణము ani undhi.
Instead of that ఈ విధంగా చేసే ప్రదక్షిణము ani ఉండాలి కదా?
శివాలయం లో ప్రదక్షిణము ఎలా చేయాలి? Page lo