గిరి ప్రదక్షిణ వివరాలు – నియమాలు:
- ఆలయ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు గిరి ప్రదక్షిణ అంటే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి తర్వాత జన్మ నుండి విముక్తి మరియు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
- మహా సిద్ధులు కొండపై నివసిస్తున్నారని భక్తుల నమ్మకం.
అరుణాచలం నగరం 8 దిక్కులు ఎనిమిది లింగాల కారణంగాకారణంగా ప్రత్యేకమైన అష్టభుజ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది గిరి ప్రదక్షణం చేసేటప్పుడు చెప్పులు లేకుండా చేయాలి. - గిరి ప్రదక్షణం 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఉదయం 9 లోపు గిరిప్రదక్షణం చేయడం మంచిది.
- ఎక్కువ బరువు ఉన్న వస్తువులు తీసుకు వెళ్ళకండి.
- గిరి ప్రదక్షిణం వెళ్లేటప్పుడు చిల్లర తీసుకువెళ్లడం తప్పనిసరి.
- గిరి ప్రదక్షణం ప్రతిరోజూ చేస్తారు. మీరు ప్రదక్షిణ చేసే సమయంలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా అందుబాటులో ఉంటుంది
- గిరి ప్రదక్షిణ ఎడమవైపు మాత్రమే చేయాలి. కుడివైపు సిద్దులు దేవతలు అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటారు.
- మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు ఓ నరుణాచల శివ అని స్మరణ చేస్తూ వెళ్ళాలి.
- గిరి ప్రదక్షణ చేసే సమయంలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించండి జ్ఞాన మందిరంలో ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది.
- అన్నదానం చేయండి మంచి ఫలితం.
- గిరి ప్రదక్షణలో వివాహం కానివారు దుర్వాస మహర్షి దేవాలయం దగ్గర ఉన్న చెట్టుకు తాడు కడతారు ఇలా చేయడం వల్ల వివాహ ఫలితం వస్తుంది.
- సంతానం కోసం దుర్వాస మహర్షి దేవాలయం దగ్గర ఉన్న చెట్టుకు తాడు కడతారు ఇలా చేయడం వల్ల అనుకూల ఫలితం వస్తుంది.
- అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం అందువల్ల గిరి ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు మహా శివుడికి ప్రదక్షిణ అని భక్తుల నమ్మకం.