హనుమాన్ మండలదీక్ష విధి
సాదారణంగా హనుమాన్ మండల దీక్షను హనుమద్వ్రతమ్ లేదా హనుమజ్జయంతి నాటి పర్వదినములలో స్వీకరిస్తారు.
దీక్షను హనుమాన్ మందిరంలో అర్చక స్వాముల సమక్షంలో స్వీకరించి 41 రోజుల పాటు కలశ ఆరాధన చేసి కఠినమైన మండలదీక్ష [Hanuman Mandala Deeksha] ను ప్రారంభించాలి. దీక్షాపరులు ఉదయం 4 గంటలకు లేని ప్రాతఃకాల ప్రార్థన చెసుకొని పీఠ పూజను చేసి అనంతరం పండ్లు పాలతో అల్పహారం తీసుకుంటారు. మధ్యాహ్నం 1 గంటలకు బిక్ష చేస్తారు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత రాత్రి పూట. పూజను నిర్వహించాలి. అనంతరం దీక్షాస్వాములు వారి వారి ఇండ్లలో పీఠ పూజను చేసుకొని భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి . దీక్ష విరమణ అయినంత వరకు కల్షంలోని కొబ్బరిని తీసుకొని గుమ్మానికి కట్టుతారు. పీఠం మీద ఉన్న బియ్యాన్ని వండుకొని బిక్ష చేస్తారు.
హనుమాన్ దీక్ష నియమములు
హనుమాన్ దీక్షలో చాల కఠినమైన నిబంధనలు [Rules for Hanuman Deeksha] ఉండడంతో ఒక్కసారి మండలదీక్ష ను స్వీకరించిన స్వాముల్లో తప్పకుండా మార్పు వస్తుంది. ఆ మార్పే నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది.
హనుమాన్ స్వాములు భక్తితో ప్రార్థన, పీఠానికి హారతి, సన్నిదానంలో నిద్రించుట, ప్రతి నిత్యం మందిర దర్శనం, మాటిమాటికి ‘జైహనుమాన్ జీ’ అని పలుకరించి రామనామ స్మరణం చేయటం, దీని ద్వార ప్రతీ ఇంట్లో సుఖ శాంతులు ఏర్పడడం చెప్పుకొదగ్గ విషయం. దీనిని నిత్య జీవితంలో పాటిస్తే కుటుంబాలు బాగా ఉంటాని మనిషి జీవితంలో పురోగతి ఉంటుందని నమ్మకం.
అంతేకాక రోగనివారణకు, శత్రునాశనముకు, ఆత్మస్థైర్యమునకు హనుమాన్ దీక్ష ఎంతగానో దోహదపదుతుంది.
1 Comment. Leave new
Hello sir mala neyalmaalu Chala baga cheppadu kaani Maala darichaaka Maala teeyatam yelaano cheppaledu