ఈ జూన్ నెలలో తిరుపతి వెళ్ళాలి అనుకుంటున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే ఈ సంవత్సరం జూన్ నెలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి యొక్క తిరుపతిలో పలు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ 2024 జూన్ నెల 1 నుంచి 5వ తేదీ వరకు మొదటగా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి అంజనాద్రి ఆకాశగంగా ఆలయం, జపాలి తీర్థంలో హనుమజ్జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేస్తోంది.
తిరుపతి లో హనుమాన్ జయంతి ఉత్సవాలు:
ఈ హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా జూన్ 1వ తేదీ నుంచి ఐదవ తేదీ సుమారు ఐదు రోజులపాటు ఆకాశగంగలోని శ్రీ బాలా ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానములో శ్రీ బాలాంజనేయ స్వామి వారు మరియు శ్రీ అంజనాదేవి లకు ప్రత్యేకమైనటువంటి అభిషేకం నిర్వహించడంతోపాటుగా జపాలి తీర్థంలో ఘనంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించేందుకు కూడా ఏర్పాటు జరుగుచున్నవి. ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు నిర్వహించే ప్రత్యేక అభిషేకాలలో భాగంగా..
- మొదటి రోజైన జూన్ ఒకటవ తేదీన మల్లెపూలతో..
- రెండవ రోజైన జూన్ రెండవ తేదీన తమలపాకులతో..
- మూడవ రోజైన జూన్ మూడవ తేదీన ఎర్రగన్నేరు పూలతో, కనకాంబరాలతో..
- నాలుగవ రోజైన జూన్ నాలుగవ తేదీన చామంతి పూలతో
- ఆఖరి రోజైన జూన్ 5వ తేదీన సింధూరంతో అభిషేకం చేస్తారు.
హనుమజ్జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించే ఇతర కార్యక్రమాలు:
తిరుమల తిరుపతిలో టీటీడీ నిర్వహించే ఈ హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా వేద పండితులచే శ్రీ ఆంజనేయ స్వామి వారి సహస్రనా మంత్రోచ్ఛారణ మధ్య స్వామివారికి మరియు అంజనాదేవికి అభిషేకాన్ని నిర్వహిస్తారు ఉదయం అభిషేక అనంతరము, శ్రీ ఆంజనేయస్వామి వారి పూజ, 10 గంటలకు ఆకాశ గంగ వద్ద శ్రీ ఆంజనేయ స్వామి వారి జన్మ వృత్తాంతం పై ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అలాగే జపాలి తీర్థంలో ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్య దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా యొక్క సామూహిక పారాయణ కూడా నిర్వహిస్తారు. అలానే ఈ హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా జరిగేటువంటి కార్యక్రమాలను సవివరంగా కింద గమనించగలరు..
- జూన్ 1వ తేదీన హరికథ
- జూన్ రెండవ తేదీన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే సంకీర్తన
- జూన్ మూడవ తేదీన పురంధర దాస సంకీర్తనలు
- జూన్ 4వ తేదీన హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారితే భజనలు
- జూన్ 5వ తేదీన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే హరికథ గానంము
అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య ఎస్పీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులతో నృత్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడానికి టిటిడి పనులను చేపట్టింది. వీటితో పాటుగా నాదనీరాజనం వేదికపై ఈ ఐదు రోజుల్లో ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్య శ్రీ హనుమాన్ జననం మరియు శ్రీ హనుమంతుడికి సంబంధించిన సంబంధించిన ప్రధాన ఆసక్తికరమైన అంశాలపై ప్రవచన కార్యక్రమం కూడా ఉంటుంది.
తిరుమల లో 2024 జూన్ లో జరిగే ప్రధాన ఉత్సవాలు:
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంలో జూన్ నెలకు సంబంధించినటువంటి విశేష ఉత్సవాలను గురించి తెలుపుతూ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనను బట్టి కింది తెలిపిన ఉత్సవాలు జూన్ నెలలో శ్రీవారి ఆలయంలో జరపనున్నారు.
- జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు తిరుమల లోని ఆకాశగంగా అంజనాద్రి బాలాంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు
- జూన్ 2న మహి జయంతి
- జూన్ 19 నుంచి 21వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్టాభిషేకము
- జూన్ 20న శ్రీ నాథమునుల వర్ష తిరు నక్షత్రం
- జూన్ 22న పౌర్ణమి గరుడసేవ