శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము జరుగుతున్న శుభ సందర్భంలో శ్రీరాముని, సీతా అమ్మవారి యొక్క వంశ వృతాంతములను వివరించు కళ్యాణ గోత్ర – ప్రవరలు.
శ్రీరామ ప్రవర:-
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.
వాసిష్ఠ ఐంద్ర ప్రమధ త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ,
నాభాగ మహారాజ వర్మణో నప్త్రే…
అజ మహారాజ వర్మణః పౌత్రాయ…
దశరథ మహారాజ వర్మణః పుత్రాయ…
శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.
సీతాదేవి ప్రవర:-
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం…
స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం…
హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం…
జనక మహారాజ వర్మణః పుత్రీం…
సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం…
శ్రీరామనవమి రోజున కళ్యాణ సందర్భంలో ఈ సీతా రామ గోత్ర – ప్రవరలు విన్నంత మాత్రాన వంశవృద్ధి కలుగును అని శాస్త్ర వచనం.