దుర్గాష్టమి పర్వదినం:
దుర్గాష్టమి తిధి శక్తి స్వరూపమైన దుర్గాదేవికి ప్రీతికరమైనటువంటి రోజు. అయితే ప్రతి మాసము ఈ దుర్గాష్టమి పర్వదినము శుక్లపక్ష అష్టమి తిధి అనగా అమావాస్య నుంచి ఎనిమిదవ రోజు నాడు వస్తుంది. అయితే ప్రతి మాసం వచ్చే దుర్గాష్టమి రోజులలో కెల్లా ఆశ్వయుజ మాసం లో వచ్చే శుక్లపక్ష అష్టమి అమ్మవారికి పరమ ప్రీతికరమైనటువంటి రోజు. దీనినే మహాష్టమీ లేదా మహా దుర్గాష్టమి అని కూడా పిలుస్తారు. తొమ్మిది రోజులపాటు జరిగే దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు లో భాగంగా ఐదవ రోజు ఈ దుర్గాష్టమి పర్వదినం వస్తుంది.
దుర్గాష్టమి వ్రతం:
దుర్గామాత అనుగ్రహం కోసం దుర్గాష్టమి రోజు నాడు దుర్గాష్టమి వ్రతం ను ఆచరిస్తారు. అలానే అస్త్ర పూజలు నిర్వహిస్తారు. అయితే ప్రతి మాసము వచ్చేటువంటి ఈ దుర్గాష్టమి రోజునాడు ఎవరైతే తాము చేసేటువంటి పనులలో ఆటంకం లేనటువంటి విజయాన్ని కోరుకుంటారో.. వారు తమ తమ ఆయుధాలకు గాని, తాము నిత్యము పని కోసం ఉపయోగించే వస్తువులకు గాని ఆరాధన చేయడం మంచిది. ఈ దుర్గాష్టమి రోజును విరాష్టమి అని కూడా పిలుస్తారు ఈనాడు దుర్గా అమ్మవారి ప్రీతికరంగా చేసేటువంటి ఆరాధనలు మరియు పూజలు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చేకూరుస్తాయి అని, అదేవిధంగా ఈరోజు ఉపవాసం చేయడము సర్వదా శుభకారము అని విశ్వాసం.
దుర్గాష్టమి వ్రత విధానం
దుర్గాష్టమి రోజు నాడు దుర్గాష్టమి వ్రత విధానం ఏ విధంగా ఆచరించాలి అనగా.. దుర్గాష్టమి వ్రతాన్ని ఆచరించేటువంటి భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించి ఇంటిని శుభ్రం చేసి, పుష్పాలు – చంద్రము మరియు ధూప దీపాదులతో అమ్మవారిని ఆరాధన చేసి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పాయసాన్నము లేదా చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. అలానే దుర్గాష్టమి వ్రత కథను కూడా చదువుకొని అక్షతలను శిరస్సున ధరిస్తారు. ఒకవేల పూర్వహితులతో కార్యక్రమం చేయించుకున్నవారు పురోహితులకు దక్షిణ తాంబూలంను ఇచ్చి సత్కరిస్తారు.
దుర్గాష్టమి వ్రత నియమాలు
- దుర్గాష్టమి వ్రతాన్ని ఆచరించేటువంటి భక్తులు ఈ రోజంతా తినడం కానీ తాగడం కానీ చేయకుండా ఉపవాసాన్ని ఉంటారు
- అయితే సాధారణంగా అమ్మవారి ఆరాధన చేసేటువంటి స్త్రీలతో పాటుగా పురుషులు కూడా ఈనాటి రోజున అమ్మవారిని ఆరాధిస్తారు
- ఈరోజు అమ్మవారి ఆరాధన చేసి ఏకభుక్తము లేదా ఒంటి పూట ఉండి పాలు పళ్ళు తింటూ అమ్మవారికి ఆరాధనలు చేస్తూ ఉపవాసం ఉండడం మంచిది.
- ఈ దుర్గాష్టమి రోజునాడు మాంసాహారం కచ్చితంగా నిషేధించబడింది
- కామ్యభీష్టం కోసం దుర్గాష్టమి వ్రతాన్ని ఆచరించేవారు తప్పకుండా నేలపై పడుకుని అమ్మవారి యొక్క నామస్మరణం చేయడం వల్ల సుఖసంతోషాలు కలుగుతాయి
ఈ దుర్గాష్టమి వ్రతం సాయంత్రం నాడు అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్లి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. కొన్ని ప్రాంతాలలో ఈ దుర్గాష్టమి రోజునాడు కుమారి పూజను కూడా ఆచరించడం ఆనవాయితీగా వస్తున్నది. 6 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినటువంటి బాలికలను దుర్గా అమ్మవారి స్వరూపంగా కుమారి పూజను చేస్తారు.
దుర్గాష్టమి రోజు చేయవలసిన పనులు:
ఈ దుర్గాష్టమి రోజునాడు పశ్చిమ భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో బార్లీ విత్తనాలను మొలకెత్తించే (అంకురారోపణ వలే) ఆరాధన కూడా ఉంది. మూడు నుంచి ఐదు అంగుళాల ఎత్తు వరకు ఈ యొక్క బార్లీ మొలకలు చేరుకున్న తర్వాత, వాటిని దేవతకు సమర్పించి తర్వాత కుటుంబ సభ్యులందరికీ అందజేస్తారు. ఈరోజు దుర్గా శక్తి మాల మంతానాన్ని దేవి ఖడ్గమాలను అలాగే దుర్గా చాలీసా చదవడం చాలా మంచిది.
దుర్గాష్టమి రోజు యొక్క ప్రాముఖ్యత
సంస్కృత పరిభాషలో దుర్గ అంటే దుర్గములను నశింపచేసేది అంటే కష్టాలను తీర్చేది లేదా ఓటమి లేనిది అని అర్థం అలాగే అష్టమి అంటే ఎనిమిదవ రోజు. హిందూ పురాణాల ఆధారంగా భద్రకాళి దేవత అనబడే అని పిలవబడే దుర్గా అమ్మవారి యొక్క ఉగ్ర స్వరూపం ఒక శక్తి స్వరూపం దుర్గాష్టమి రోజునాడు మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడిని దుర్గామాత సంహరించినటువంటి పర్వదినంగా జరుపుకుంటారు. భక్తిశ్రద్ధలతో దుర్గా అమ్మవారిని ఈరోజు ఆరాధిస్తే సమస్తమైనటువంటి కోరికలు తీరుతాయి అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.