ఆలయంలో అర్చకులు మీ(స్ర్తీల) నుదుటి మీద బొట్టు పెడుతున్నారా? అలా పెట్టవచ్చో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా???
మనం సాధారణంగా ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న తర్వాత అర్చక స్వాముల వారు మనకి తీర్ధం ఇచ్చి, అక్షతలు వేసి, ఆ దేవుడు /దేవతకి పూజచేసిన కుంకుమ లేదా విభూతిని బొట్టుగా పెడతారు. మరి స్త్రీల విషయంలో???
చాలా సందర్భాలలో అర్చక స్వాముల వారు(కొందరు అర్చకులు మాత్రమే) తెలియక స్త్రీ – పురుషులిరువురికీ బొట్టును పెట్టేస్తారు. కానీ ఆవిదంగా చేయరాదు.
స్త్రీ నుదుటిమీద బొట్టును పెట్టే అధికారం కేవలం తన భర్తకి మాత్రమే ఉంది. వివాహ సమయంలో మొట్టమొదటి సారిగా స్త్రీ యొక్క భర్త తన నుదుటి/లలాటం మీద బొట్టును పెడతాడు. ఆ సమయం నుంచి తన నుదుటి పై బొట్టు పెట్టడానికి అర్హుడు తన భర్త మాత్రమే.
ఈ విషయం తెలిసిన అర్చక స్వాములవారు పురుషునికి బొట్టుపెట్టి , స్త్రీ లను బొట్టు పెట్టుకొమ్మని చెప్పి ఆ పాత్రను వారి దగ్గరకి ఇస్తారు.
ఇకపై అర్చకులు /పూజారులు మీ (స్త్రీ ల) నుదుటిపై బొట్టును పెట్టే సమయంలో వారికి ఈ విషయం తెలియ చెప్పి మీరు బొట్టును ధరించండి.