ఆశ్వయుజ మాసంలో దేవతాప్రతిష్ట ముహుర్తాలు – Devata Pratishta Dates in the Month of October

Loading

Devata Pratishta Muhurtham Dates In Ashweeja Masam - Devata Pratishta Ceremony Dates in October, November 2024

ముహూర్తం అంటే ఏమిటి ?

పురాతన కాలం నుండి, హిందువుల వివాహాలు, గృహప్రవేశం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, నామకరణం, అన్నప్రాసన, ఉపనయనం మొదలైన ముఖ్యమైన కార్యక్రమాలు లేదా కార్యక్రమాలను నిర్వహించడానికి మంచి రోజు మరియు సమయాన్ని ఎంచుకునే సంప్రదాయాన్ని అనుసరిస్తారు. దీనిని ముహూర్తం అంటారు. జ్యోతిష్య శాస్త్రం  ద్వారా ఒక నిర్దిష్ట శుభకార్యానికి తగిన రోజు మరియు సమయాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యమైనది.

హిందూ పంచాంగం లో ఒకరి రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి రోజువారీ ముహూర్తాలు ఉన్నాయి, అలాగే ప్రధాన కార్యక్రమాలకు ముహూర్తాలు ఉన్నాయి. రాహుకాలం, వర్జ్యం, యమగండ, దుర్ముహూర్తం వంటివి లేని సమయాలు చాలా మంది హిందువులు ఇప్పటికీ రోజువారీ అనుసరించే విధానాలు. ముహూర్తం అనేది కాలాన్ని కొలిచే వేద ప్రమాణం. 24 గంటల పగలు+రాత్రి 30 ముహూర్తాలను కలిగి ఉంటుంది. ఒక్కో ముహూర్తం 48 నిమిషాల పాటు ఉంటుంది.

ముహూర్తాలను ఎలా నిర్ణయిస్తారు?

ముహూర్తం చూసే ప్రక్రియలో ముఖ్యంగా తారా బలం, చంద్ర బలం, లగ్న బలం, పంచక రహితం మొదలైన విషయాలు గమనించాల్సి ఉంటుంది. వీటి తో పాటు చివరిగా ఆయా కార్యక్రమాలనిర్ధారణ చేసే సమయంలో ఉండే తిథి, వార, నక్షత్ర, యోగ ములను కూడా పరిగణలోనికి తీసుకోవాలి. వారము కన్నా తిథి, తిథికన్నా నక్షత్రము, నక్షత్రముకన్నా లగ్నమూ అత్యంత బలీయములు. కనుక నక్షత్ర, లగ్నములు అనుకూలముగా ఉన్నచో తిథి, వారములు మధ్యస్థముగా ఉన్ననూ ముహూర్తము నిర్ధారణ చేయవచ్చును.

అయితే ఏ ముహూర్తం చూసినా, ఆయా కార్యక్రమానికి సంబంధించిన యోగ్యమైన లేదా నిర్దేశించబడిన శుభ నక్షత్రాలను, యజమానులు జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రముకు సరిచూసి ముహుర్తములను నిర్ణయింపవలెను.

మీ యొక్క శుభకార్యాలకు ముహూర్తము నిర్ణయింపవలెనన్నా లేదా మీకు సరైన ముహూర్తము కావలేనన్నా మమ్మల్ని సంప్రదించగలరు.  పురోహిత్యము, జ్యోతిష్య శాస్త్రంలో 25 సంవత్సరాలు అనుభవం కలిగిన పండితులచే మీ జన్మ లేదా నామ  నక్షత్రాలు బట్టి మంచి ముహుర్తాలు నిర్ణయించగలము. 

ఆశ్వయుజ మాసంలో దేవతాప్రతిష్ట ముహుర్తాలు – Devata Pratishta Dates in the Month of October

ఆశ్వయుజ మాసం తెలుగు సంవత్సరంలో ఏడవ నెల. భాద్రపద మాసం తర్వాత వచ్చే మాసమే ఆశ్వయుజ మాసం. చంద్రుడు ఈ మాసంలో అశ్విని నక్షత్రంతో కూడుకొని ఉంటాడు కాబట్టి ఆశ్వయుజ మాసం అని అంటారు. ఆశ్వయుజ లో దేవి సరన్నవరాత్రులు ప్రారంభము అవుతాయి అలానే దీపావళి తో ఈ మాసం పూర్తి అవుతుంది. దుర్గా, లక్ష్మీ అమ్మవార్ల ఆరాధనకు ఆశ్వయుజ మాసం ప్రీతికరమైనది. ఆశ్వయుజ మాసంలో వివాహాలు, గృహాప్రవేశాలు, శంఖుస్థాపనలు, నామకరణ, అన్నప్రాశన వంటి శుభకార్యాలు తలపెట్టడం చాలా శ్రేయోదాయకం.

ఆశ్వయుజ మాసంలో దేవతాప్రతిష్ట ముహుర్తాలు అతి తక్కువగా ఉంటాయి. కావునా యాజమానుల, కార్యక్రమం చేయించే పురోహితులను దృష్టి యందు ఉంచుకొని ఆశ్వయుజ మాసంలో దేవతాప్రతిష్ట ముహుర్తాలు అన్నిటినీ ఒకచోట సమకూర్చి ఉవ్వడం జరిగినది. అందరూ ఈ దేవతాప్రతిష్ట ముహూర్తాలను గమనించి, మీకు ఎంతవరకు అవి సరిపడుతాయో  యోగ్యులయిన పండితులచే నిర్ధారణ చేసుకోగలరు

Get Muhurtham Dates via Email or WhatsApp

Devata Pratishta Ceremony Dates in Ashwayuja Masam, Devata Pratishta Ceremony Muhurtham Dates in 2024, Devata Pratishta Dates in 2024, Devata Pratishta Dates in October Month, Muhurtham Dates in Ashwayuja Masam, Muhurtham Dates in October 2024
జ్యేష్ట మాసంలో దేవతాప్రతిష్ట ముహుర్తాలు – Devata Pratishta Dates in the Month of June
మార్గశిర మాసంలో దేవతాప్రతిష్ట ముహుర్తాలు – Devata Pratishta Dates in the Month of December

Related Posts