హిందూ పురాణాల ప్రకారం, వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ముఖ్యమైనది చవితి తేదీ. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా చేస్తారు. తొలిగా వరద చతుర్ధి. రెండోది సంకష్ట హర చతుర్థి.
అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్ట హర చతుర్థి/సంకట హర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా ఆచరించెదరు.
సంకటాలను తొలగించే సంకట హర చతుర్థి వ్రతాన్ని మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. ఈ సంకష్ట హర చతుర్థి మంగళవారం నాడు వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటారు. ఇలా రావడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో జరుగుతుంది. అంగారక చతుర్థి నాడు సంకట హర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజ దోష సమస్యలన్నీ తొలగిపోయి.. వారు చేసే పనుల్లో సంకటాలన్నీ తొలగిపోయి.. పనులన్నీ సఫలమవుతాయని ప్రతీతి.
ప్రతి మాసంలో క్రిష్ణ పక్షంలో అనగా పౌర్ణమి తర్వాత, మూడు లేదా నాలుగు రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోష కాల సమయానికి (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వస్తుందో ఆరోజున సంకష్ట చతుర్థిగా పరిగణించాలి. అయితే రెండురోజుల పాటు ప్రదోష సమయంలో చవితి ఉండటం అనేది సాధారణంగా జరగదు. ఒకవేళ అలా ఎప్పుడైనా జరిగితే రెండో రోజున సంకటహర చవితిగా పరిగణించాలి.
పూజా విధానం:-
సంకష్ట చతుర్థి వ్రతాన్ని 3, 5, 11, లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి రోజున ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే శిరస్సున స్నానం చేసి, తర్వాత వినాయకుడిని ఆరాధించాలి.
ముందుగా అరమీటర్ పొడవు ఉన్న వైట్ లేదా ఎరువు రంగులోని రవిక ముక్కను తీసుకుని వినాయకుడి ముందు ఉంచాలి. దానిపై పసుపు, కుంకుమ వేయాలి. అనంతరం మీ మనసులోని కోరికలను తలచుకుని మూడు గుప్పిళ్ల బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్జురాలు, రెండు వక్కలు, దక్షిన పెట్టి మనసులోని కోరికను మరోసారి తలచుకుని మూటకట్టాలి.
సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవాలి. ఆ మూటను స్వామి ముందు ఉంచి దీపం వెలిగి కొబ్బరికాయ లేదా తాజా పండ్లను స్వామికి నివేదించాలి. అనంతరం వినాయకుని ఆలయానికి వెళ్లి 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. అలాగే స్వామికి గరికను సమర్పించాలి. మీకు వీలైతే గణపతి హోమమును కూడా చేయించొచ్చు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి వినాయకుడిని లఘువుగా పూజించాలి. ఈ నియం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామి వారికి నివేదించి సాయంత్రం తినాలి.
సంకష్ట చతుర్థి నాడు తమ కుటుంబం, పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని.. దీర్ఘాయువు కోసం వినాయకుడిని పూజించాలని.. మంత్రాలను పఠించడం ద్వారా గణేశుడిని ప్రసన్నం చేసుకుంటారు. ఈ సమయంలో సంకష్ట చతుర్థి రోజున ఈ గణేష్ మంత్రాలను జపిస్తే మంచి ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. ‘ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయా ధీమఃతన్నో దన్తిఃప్రచోదయాత్.. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభంఃనిర్విఘ్నం కురులో ఉన్న దేవుడు, సకల కార్యాలు సదా ఉంటాయి.. ఓం గణగణపతయే నమః
సంకట హర చతుర్థి వ్రత కథ:-
పురాణాల ప్రకారం.. ఒకరోజు ఇంద్రుడు తన విమానంలో బృఘండి(వినాయకుని భక్తుడు) అనే రుషిని దగ్గర్నించి చూస్తాడు. తను ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా..ఘర్ సేన్ అనే రాజు రాజ్యం దాటే వేళ, అనేక పాపాలు చేసిన ఓ వ్యక్తి గగనంలో విహారిస్తుండటాన్ని చూస్తాడు. తన చూపు పడగానే.. ఆ విమానం ఒక్కసారిగా ఆగిపోతుంది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యపోయిన మరో దేశపు రాజు సురసేనుడు బయటికొచ్చి ఆ వెలుగును ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అప్పుడు ఇంద్రుడిని చూసి ఎంతో ఆనందపడిన అతను, తను ఇంద్రుడికి నమస్కారం చేస్తారు. తన విమానం అక్కడ ఎందుకు ఆగిందో కారణం అడగగా.. అప్పుడు ఇంద్రుడు ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు చేసిన వ్యక్తి చూపు తన విమానంపై పడటంతో ఇది అర్ధాంతరంగా ఆగిపోయిందని చెబుతాడు. అప్పుడు ఆ రాజు మరి మీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుందని అడగగా.. అప్పుడు ఇంద్రుడు ఈరోజు పంచమి.. నిన్న చతుర్థి. నిన్నటిరోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో.. వారి పుణ్యఫలాన్ని నాకిస్తే.. నా విమానం తిరిగి ప్రారంభమవుతుందని చెబుతాడు. అప్పుడు సైనికులంతా కలిసి నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారి కోసం రాజ్యంలో తిరిగారు. అయితే వారికి ఎవరూ దొరకరు. అదే సమయంలో గణేష్ దూత వచ్చి చనిపోయిన ఓ మహిళ శవాన్ని మోసుకెళ్తుంటారు. అప్పుడు తను ఎంతో పాపాత్మురాలని.. ఆ మహిళను ఎందుకు గణేష్ లోకానికి ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. అందుకు గణేష్ దూత ‘నిన్నంతా ఈ మహిళ ఉపవాసం ఉంది.. తెలియకుండా ఏమీ తినలేదు.. చంద్రోదయం తర్వాతే కొంత తిన్నది.. రాత్రంతా నిద్రించి చంద్రోదయ వేళ కొంత తినడం వల్లే తనకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతాన్ని పూర్తి చేసింది. ఈరోజు మరణించింది’ అని చెప్పాడు. అంతేకాదు ఈ వత్రం చేస్తే గణేష్ లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోవడం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేశుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బతిమాలారు. ఆ స్త్రీ దేహాన్ని తమకు ఇవ్వాలని.. అలా చేస్తే ఇంద్రుని విమానం తిరిగి బయలుదేరతుందని ఎంతో చెప్పారు. తన పుణ్యఫలాన్ని వారికిచ్చేందుకు గణేశుని దూత ఒప్పుకోలేదు. ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. అంతే అప్పుడు ఇంద్రుడు విమానం బయలుదేరుతుంది. ఈ కథ సంకట హర చతుర్థి, ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో సంకష్ట చవితి ఉపవాస వివరాలను వివరించింది. అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండే వారికి ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలా మంది నమ్ముతారు.