ఒక చెట్టును ఫోటోతీసి ఇంట్లో ఉంచుకొని, అందులోంచి చెట్టు ప్రయోజనాల్ని పొందడం ఎలాంటిదో – రికార్డు చేసిన మంత్రాల ద్వారా అనుష్ఠానం, అర్చనాదులు చేయడం అలాంటిదే. అందులోంచి ప్రాణశక్తిని పొందలేం.
నేర్చుకోవడానికి, లేదా విని అనుభూతిని పొందడానికి ఈ కేసెట్స్ పనికిరావచ్చు. అంతేగానీ వ్రతాలు, అభిషేకాలు చేయడానికి మాత్రం పనికిరావనే చెప్పాలి.
మంత్రం బ్రాహ్మణాధీనం. పూజలు, వ్రతాది యజ్ఞ (ఆరాధనా) కార్యాలలో బ్రహ్మను (విప్రుడిని) ఉచిత స్థానంలో ఆసీనుని చేసి మాత్రమే కార్యక్రమం చేయాలి. యజ్ఞాలో, ప్రతిష్ఠలలో ‘ఋత్విగ్వరణం‘ అంటే ఇదే. అలాగ పూజాదులను స్వయంగా అనుష్ఠించలేనప్పుడు, బ్రహ్మస్థానంలో ఒకరిని నియమితుని చేసి వారు మంత్రోచ్చారణ చేస్తుంటే వీరు ఆచరిస్తుంటారు. అలా చేసిన పూజకి మాత్రమే పూజ అని పేరు. అలాంటి పూజ వలెనే ఫలితం మీ ఖాతాలో పడుతుంది.
న సిద్ధ్యతి క్రియాకాపి సర్వేషామ్ సద్గురుం వినా |
మయా శ్రుతా పురా సత్యం శ్రుతిరేషా సనాతనీ ||
గురువు(పూజారి/పండితుడు) లేనిదే యే పూజా ఫలించదన్న విషయం సనాతనమైన వేదవాక్యము.
1 Comment. Leave new
avunu andi chala baga chepparu kani e rojullo chala mandi cassters petukone pooja chesukuntunaru