మనకు ఉన్నటువంటి నవగ్రహములలో బుధగ్రహం నాలుగవ గ్రహము. జాతక రీత్యా బుధగ్రహం బలహీనంగా ఉన్నవారూ లేదా బుధగ్రహ దోషంతో బాధపడుతున్నవారు, ఏ యే పనులు చేయడంవల్ల బుధగ్రహ దోషం నుంచి ఉపశాంతి పొందుతారో ఇప్పుడు పరిశీలిద్దాం.
తల పెట్టిన పనులయందు ఆటంకములు ఏర్పడటము, వ్యాపారములయందు లాభములు రాకపోవడము, నూతన కార్యక్రమములు నెరవేరక పోవడము, బుద్ధిలో వైక్లభ్యము కలిగి బుద్ధి మంధ్యము రావడము మదలైనవి అన్నీ కూడా బుధగ్రహ దోషము వల్ల ఏర్పడే సమస్యలు కావునా…
బుధ గ్రహ దోషనివారణ కొరకు నానబెట్టిన పెసరపప్పుతో చేసిన, పెసరవడలను బుధవారం రోజున పంచడం కానీ, ఆవుకు పెట్టడం వల్ల కానీ బుధగ్రహ ఉపశాంతి కలిగి తద్వారా బుధగ్రహం వల్ల ఏర్పడే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చును. అంతే కాకుండా బుధగ్రహ స్తోత్రమును 11 సార్లు పారాయణ చేయడం వల్ల కూడా మంచి ఫలితములను పొందవచ్చును.
బుధగ్రహ స్తోత్రము:
ప్రియంగు కళికా శ్యావ్యాం, రూపేణ ప్రతిమం బుధం|
సౌమ్యం సత్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం||
సేకరణ: https://www.panditforpooja.com/blog/budha-graha-dosha-nivarana-remedies/