ఎవరైనా గ్రహ దోషాలతో బాధపడితే ప్రత్యేకించి ఆంజనేయ స్వామివారిని మంగళవారం నాడు లేదా శనివారం నాడు పూజిస్తూ ఉంటారు. ఈ కారణాల వల్లే మన సంస్కృతిలో మంగళవారానికి అదే విధంగా శనివారానికి హనుమంతుని విషయంలో ప్రత్యేక స్థానం ఉంది.
- ఆంజనేయ స్వామి వారి జన్మించినటువంటి రోజు చైత్రమాస శుద్ధ పూర్ణిమ.
- స్వామివారిని మంగళ మూర్తి అని కూడా పిలుస్తూ ఉంటారు దీనికి అర్థం సంతోషాన్ని ఇచ్చేవాడు అని. అందుకే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని కొలుస్తూ ఉంటారు.
- సాధారణంగా అంగారక గ్రహం లేదా కుజ గ్రహం ఎరుపువర్ణాన్ని కలిగి ఉంటుంది స్వామివారి ధరించేటువంటి సింధూరం కూడా అటువంటి వర్ణమునే కలిగి ఉండడం ఇక్కడ విశేషం.
- గ్రహాల వల్ల ఎవరికైనా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు హనుమంతుడిని ప్రత్యేకంగా మంగళ మరియు శని గ్రహాల కోసం గుర్తు చేసుకుంటారు, అందుకే మన సంస్కృతిలో మంగళవారం మరియు శనివారం ప్రత్యేక పూజలు ఉన్నాయి.
- నిజమైన భక్తితో స్వామివారిని మంగళవారం నాడు లేదా శనివారం నాడు అర్చించే భక్తులకు ఎటువంటి గ్రహ దోషాలు ఉండవు.
- మంగళవారం నాడు మరియు శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అర్చించి, తమలపాకులతో ఆకు పూజ చేసి, వడమాల లేదా అప్పాల మాల సమర్పించిన యెడల తప్పక కోరికలు నెరవేరుతాయి.
- శ్రీ హనుమంతుని భక్తులుగా ఉన్న వారికి నరఘోష మరియు బంధు ఘోష గ్రహ బాధలు తొలగి భూత ప్రేతాది శక్తులు దరిచేరకుండా రక్షణ ఇస్తాయి.