Posts by Ravikumar Pendyala
సింహాచలం దేవస్థానం లేదా సింహాద్రి అప్పన్న ఆలయం ఆంధ్ర ప్రదేశ్లోని విశాఖపట్నం సమీపంలో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయం. శ్రీమహావిష్ణువు యొక్క నాలుగవ అవతారమైనటువంటి వరాహరూపంలో స్వామివారు ఇక్కడ వరాహ నరసింహస్వామి వారిగా దర్శనమిస్తారు. భక్తులకు సింహాచల వరాహ నరసింహ ఆలయ దర్శన సమయాలు ఉదయం 4:00 నుండి రాత్రి 9:00 వరకు ఉంటాయి. ఉగాది, శ్రీరామనవమి, అక్షయతృతీయ, నరసింహ జయంతి, శ్రావణమాస ఉత్సవాలు, కార్తీక మాస ఉత్సవాలు, దసరా శరన్నవరాత్రులు, మరియు ధనురామాసం వంటి అన్ని పండుగ రోజులలో సింహాచలం ఆలయ సమయాలు మారవచ్చు.
సింహాచలం దేవస్థానం ఆలయ రోజువారీ షెడ్యూల్, ఆరతి/పూజలు/సేవా సమయాలు, ముగింపు & ప్రారంభ సమయాలు & గంటలు, ఈ క్రింది విధంగా ఉన్నాయి.
రోజులు | గంటలు/సమయాలు | దర్శనం/ఆరతి/పూజలు/సేవలు |
---|---|---|
సోమవారం నుండి ఆదివారం వరకు | 04:00 నుండి 04:10 వరకు | మేలుకొలుపు (నాదస్వర వాయిద్యము) |
సోమవారం నుండి ఆదివారం వరకు | 04:10 నుండి 04:30 వరకు | సుప్రభాత పఠనం |
సోమవారం నుండి ఆదివారం వరకు | 04:30 నుండి 04:45 వరకు | సుప్రభాత దర్శనములు |
సోమవారం నుండి ఆదివారం వరకు | 04:45 నుండి 05:00 వరకు | అంతరాలయ సమ్మర్జనము |
సోమవారం నుండి ఆదివారం వరకు | 05:00 నుండి 05:45 వరకు | సహస్ర నామార్చన పూజ |
సోమవారం నుండి ఆదివారం వరకు | 05:00 నుండి 06:30 వరకు | ప్రాతరారాధనము |
సోమవారం నుండి ఆదివారం వరకు | 05:30 నుండి 09:30 వరకు | వేద ఇతిహాస పురాణముల పారాయణము |
సోమవారం నుండి ఆదివారం వరకు | 05:30 నుండి 06:30 వరకు | ఆరాధన సేవా టికెట్ దర్శనం (ఆర్జిత సేవ) |
సోమవారం నుండి ఆదివారం వరకు | 06:30 నుండి 11:30 వరకు | సర్వదర్శనములు |
సోమవారం నుండి ఆదివారం వరకు | 09:30 నుండి 10:30 వరకు | నిత్య కల్యాణం |
సోమవారం నుండి ఆదివారం వరకు | 9:30 నుండి | శ్రీ స్వామి వారి నిత్య కల్యాణం |
సోమవారం నుండి ఆదివారం వరకు | 11:30 నుండి 12:00 వరకు | మహానివేదన (రాజభోగం) దర్శన నిలిపివేత |
సోమవారం నుండి ఆదివారం వరకు | 12:00 నుండి 14:30 వరకు | సర్వదర్శనములు |
సోమవారం నుండి ఆదివారం వరకు | 14:30 నుండి 15:00 వరకు | మద్యాహ్న విరామం (పవళింపు సేవ) దర్శన నిలిపివేత |
సోమవారం నుండి ఆదివారం వరకు | 15:00 నుండి 19:00 వరకు | సర్వదర్శనములు |
సోమవారం నుండి ఆదివారం వరకు | 17:00 నుండి 20:00 వరకు | వేదపారాయణము |
సోమవారం నుండి ఆదివారం వరకు | 19:00 నుండి 20:30 వరకు | రాత్రి ఆరాధన |
సోమవారం నుండి ఆదివారం వరకు | 19:30 నుండి 20:30 వరకు | ఆరాధన సేవా టికెట్ దర్శనం (ఆర్జిత సేవ) |
సోమవారం నుండి ఆదివారం వరకు | 20:30 నుండి 21:00 వరకు | సర్వదర్శనములు |
సోమవారం నుండి ఆదివారం వరకు | 21:00 తర్వాత | ఏకాంత సేవ, కావాట బంధనం |
సింహాచలం దేవాలయం(విశాఖపట్నం) దర్శన గమనిక:
- స్వర్ణపుష్పార్చన (ప్రతి గురువారం 07.00 AM – 08.00 AM)
- సహస్ర దీపాలంకరణ సేవ (ప్రతి శనివారం సాయంత్రం 05.30 – 06.30 వరకు)
- సుదర్శన నారసింహ యాగం (నెలకోసారి స్వాతి నక్షత్రం రోజున)
సింహాచలేశ్వర స్వామి వారి ప్రధాన పూజల వివరాలు:
- స్వామి వారి నిత్యకల్యాణం: టిక్కెట్టు ధర రూ.1000, రోజూ జరిగే ఈ సేవలో స్వామివారి పట్టు శేష వస్త్రం, చీర, రవికె, 80 గ్రాముల బరువు ఉండే 6 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు, ఆరుగురికి ఉచిత దర్శనం, అన్నదానంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు.
- స్వర్ణ పుష్పార్చన: టిక్కెట్టు ధర రూ.1116, ప్రతి గురువారం ఉదయం 7 గంటల నుంచి గంటపాటు జరుగుతుంది. పాల్గొన్న వారికి కండువా, రవికె, 2 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు ఉచితంగా అందజేస్తారు.
సింహాద్రి అప్పన్న పూజా, సేవల ధరలు
1 | అష్టోత్తర శతనామార్చన | రూ. | 200/- |
2 | సహస్రనామార్చన (07:30 AM – 08:00 AM) (గురువారం & ఆదివారం మినహా) | రూ. | 500/- |
3 | అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన | రూ. | 100/- |
4 | కప్పస్థభం ఆలింగనం | రూ. | 25/- |
5 | గోపూజ | రూ. | 50/- |
6 | నిత్య కల్యాణం (09.30 AM – 10.30 AM) | రూ. | 1000/- |
7 | స్వర్ణ తులసిదళార్చన (ప్రతి ఏకాదశి రోజు) | రూ. | 2116/- |
8 | స్వర్ణ పుష్పార్చన (ప్రతి గురువారం మరియు ఆదివారం) | రూ. | 2116/- |
9 | శాశ్వత లక్ష కుంకుమార్చన | రూ. | 20000/- |
10 | శాశ్వత లక్ష తులసి పూజ | రూ. | 20000/- |
11 | నిత్యపూజ, భోగకైంకర్యము | రూ. | 10000/- |
12 | శాశ్వత నిత్య కల్యాణం | రూ. | 10000/- |
13 | శాశ్వత గరుడ సేవ | రూ. | 5000/- |
14 | సహస్ర దీపాలంకరణ సేవ (ప్రతి శనివారం 05.30 PM – 06.30 PM) | రూ. | 250/- |
15 | సుదర్శన నారసింహ యాగం (నెలకోసారి స్వాతి నక్షత్రం రోజున) | రూ. | 2500/- |
16 | శ్రీ లక్ష్మీ నారాయణ వ్రతం | రూ. | 100/- |
టిక్కెట్లు దొరికే స్థలాలు:
- అన్ని పూజా టిక్కెట్లు ఆలయంలోని కప్పస్తంభం వద్ద ఇస్తారు. రూ.100 దర్శనం టిక్కెట్లను గాలిగోపురం వద్ద ప్రత్యేక కౌంటర్లో ఇస్తారు. రూ.20 టిక్కెట్లు క్యూలైన్ల మధ్యలోనే ఇస్తారు.
లభించే ప్రసాదాలు:
- లడ్డూ(80గ్రాములు)
- పులిహోర
- చక్కెర పొంగలి
- రవ్వ లడ్డూ
భక్తులకు మనవి: ప్రస్తుత ఆలయ పాలక మండలి మరియు ఇతర అభివృద్ధి విధానాలలో వచ్చిన మార్పులలో భాగంగా.. ధరల వివరాలలో హెచ్చు తగ్గులు గణనీయం గా ఉండవచ్చు. భక్తులు అది గమనించవాలసిందిగా ప్రార్ధన.