హనుమాన్ జయంతి / హనుమజ్జయంతి పండుగ
హనుమాన్ జయంతి ఈ పండుగను భారతదేశంలోని హనుమంతుని భక్తులందరూ అత్యంత వైభవంగా జరుపుకుంటారు వానర దేవుడైనటువంటి హనుమంతుల వారు ఈనాటి రోజున జన్మించాడని భావించి విశేషంగా హనుమజ్జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటారు అయితే చాలామంది భక్తులు వారు అనుసరించేటువంటి క్యాలెండర్ ప్రకారము వారు ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి హనుమాన్ జయంతి పండుగను వేరు వేరు రోజులలో ఆచరిస్తారు అయితే ఉత్తర భారతంలోని వారందరూ చైత్ర పూర్ణిమను హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు దక్షిణ భారతదేశపు హనుమంతుని భక్తులు వైశాఖ శుద్ధ దశమి రోజున హనుమాన్ జయంతి ఉత్సవాలను చేస్తారు. ఒకవేళ ఈ హనుమాన్ జయంతి మంగళవారం తో కుడి ఉంటే ఇంకా మహా పర్వదినంగా జరుపుకుంటారు.
అసలు హనుమాన్ జయంతిని ఎప్పుడు చేయాలి?
కలౌ పరాశర స్మృతి: కలియుగంలో పరాశర సంహిత అను స్మృతి గ్రంధం ప్రామాణికం కనుక.. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం..
శ్లో: వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే
పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే..
పైన తెలిపిన ప్రామాణిక శ్లోకాన్ని అనుసరించి.. ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించాడని అందుకే ఈరోజున హనుమంతుడి జన్మతిథి చేసుకోవడం అన్నీ రకాలా శ్రేష్టం అని అర్ధమగుచున్నది.
హనుమజ్జయంతి ఏ యే ప్రాంతాలలో ఎప్పుడు నిర్వహిస్తారు?
- హనుమాన్ జయంతిని కొందరు చైత్ర మాసం పౌర్ణమి నాడు చేస్తుండగా మరికొందరు వైశాఖ దశమి నాడు జరుపుకోవటం గమనార్హం.
- కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మూల నక్షత్రంలో జరుపుకుంటే.. .
- మహారాష్ట్రలో చంద్రమాన పంచాంగం ప్రకారం చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి నాడు జరుపుకొంటారు.
- ఇక తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లో హనుమజ్జయంతి ని వైశాఖమాసం కృష్ణపక్ష దశమి నాడు జరుపుకుంటారు.
- కొందరు హనుమాన్ భక్తులు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్లలో 41 రోజుల హనుమాన్ మండల దీక్షను చైత్రమాసం పౌర్ణమి నాడు ప్రారంభించి వైశాఖమాసం కృష్ణపక్షం 10రోజున ముగిస్తారు.
హనుమద్ విజయోత్సవం అంటే ఏమిటి?
అయితే కొన్ని ఇతిహాసాల ప్రకారం చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు చెబుతారు. ఈ కారణంగా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు హనుమద్ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమజ్జయంతిగా చేసుకుంటారు.