భగవంతుడి పూజ కోసం ఉపయోగించాల్సిన పువ్వులను కోసేటప్పుడు కానీ పూజ చేసే సమయంలో కానీ అనుకోకుండా చేతిలోని పుష్పాలు నేల మీద పడితే???అలా కింద పడిన పువ్వులతో పూజ చేయవచ్చా???
పూజ చేసేడపుడు కింద పడిన పువ్వులను ఎన్నడూ తిరిగి భగవంతుడికి సమర్పించరాదు. నేలమీద పడిన పూలతో పూజ చేయడం మహాపాపం.
భగవంతుడికి వినియోగించే పూలలో, కింద పడిన పూలను కలపకుండా పక్కన పెట్టుకోవాలి. నేల మీద పడినది ఏదైనా భూమాతకే చెందుతుంది. కనుక మరల వాటిని పూజకు వినియోగించకుండా పచ్చని మొక్కల మొదట్లో లేదా పారే నీటిలో వేయాలి.
పారిజాత పువ్వులు కిందనే పడతాయి. వీటికి ఈ నియమం వర్తించదు.