ఒక వ్యక్తి స్త్రీ పట్ల చూపించే కొన్ని వ్యామోహ లక్షణాల ఆధారంగా తాను పతనమవుతున్నాడు అని మనం గుర్తించవచ్చు.
స్మరణం దర్శనం స్త్రీణాం గుణకర్మానుకీర్తనమ్ ।
సమీచీనత్వధీస్తాసు ప్రీతిః సమ్భాషణం మిథః ॥
సహవాసశ్చ సంసర్గోఽష్టధా మైథునం విదుః ।
ఏతద్విలక్షణం బ్రహ్మచర్యం చిత్తప్రసాదకమ్ ॥
పై శ్లోకముల ఆధారంగా పురుషునికి వ్యామోహం కలిగిన స్త్రీ అస్తమానూ స్మరణ లోకి వస్తుంది. దానిచేత ఆమెను పదే పదే చూడాలనుకోవడం, అవసరం ఉన్నా లేకున్నా ఆమె గుణాలని, పనులని కీర్తించడం మొదలు పెడతాడు. ఆమెకు దూరంగా కుర్చుని మాట్లాడాల్సిన వాడు దగ్గర దగ్గరగా నడవడం, ఆమె మనస్సు ప్రీతి పొందేతట్టుగా పొగిడి మాట్లాడటం(స్త్రీల యందు వసీకరణ ప్రయోగంలో మొట్టమొదటి విద్య నిష్కారణంగా స్త్రీని పొగడటం) ఇవన్నీ చేయడం వల్ల మెల్ల మెల్లగా స్త్రీపురుషులిరువురికి స్నేహం ఏర్పడుతుంది. ఆఖరికి మైధున రూపంలో జీవితం భ్రష్టత్వం(నాశనం) అవుతుంది. తద్వారా ఆ వ్యక్తి యొక్క మనస్సు చంచలమై, బ్రహ్మచర్యం పతనమై అధోగతులపాలవుతాడు.
గమనికి: పై సమాచారం ఎవరిని ఉద్దేశించి తెలిపినది కాదు అని గమనించగలరు. సర్వవేదాన్తసిద్ధాన్తములోని విషయాన్ని తెలిపే ప్రయత్నం మాత్రమే.
సేకరణ: https://www.panditforpooja.com/blog/how-to-know-if-someone-is-spoiled/