రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే!
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః!!
శ్రీరాముడు జన్మించిన పవిత్ర దినముగా శ్రీ రామనవమి పండుగను జరుపుకొంటాము. ఈ సంవత్సరము 17 వ తేదీ ఏప్రిల్ బుధవారం శ్రీరామనవమి పండుగ.
శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం గా భూమి మీద సంచరించి, మానవతా విలువలను తెలిపిన మహోన్నతమైన వ్యక్తి శ్రీరాముడు. ధర్మమునకు మూర్తీభవించిన నిదర్శనం శ్రీరాముడు. ఈ రోజున రామకళ్యాణం చేయుట వలన అనంత పుణ్యఫలితం లభించును. రామునిని పూజించినంతమాత్రాన ధైర్యము, విజయము లభించును. రామ నామమును జపించినా, రామకధను వినినా, సీతారామ కళ్యానం తిలకించి పానకమును తీసుకొనినా , సీతారాముని అనుగ్రహం తప్పక కలుగును.
శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా ఇరువురి వంశ వృత్తాంతం తెలుసుకొందామా???
రఘువంశ వర్ణన (దశరథ మహారాజు పూర్వీకులు):
- చతుర్ముఖ బ్రహ్మ
- మరీచి
- కశ్యపుడు
- సూర్యుడు
- మనువు
- ఇక్ష్వాకుడు
- కుక్షి
- వికుక్షి
- భానుడు
- అనరంయుడు
- పృథుడు
- త్రిశంకువు
- దుందుమారుడు
- మాంధాత
- సుసంధి కి ఇద్ధరు ధృవసంధి, ప్రసేనజిత్
- ధృవసంధి
- భరతుడు
- అశితుడు
- సగరుడు
- అసమంజసుడు
- అంశుమంతుడు
- దిలీపుడు
- భగీరతుడు
- కకుత్సుడు
- రఘువు
- ప్రవృద్ధుడు
- శంఖనుడు
- సుదర్శనుడు
- అగ్నివర్ణుడు
- శీఘ్రకుడు
- మరువు
- ప్రశిశృకుడు
- అంబరీశుడు
- నహుశుడు
- యయాతి
- నాభాగుడు
- అజుడు
- దశరథుడు
- రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు.
జనక వంశ వర్ణన (జనక మహారాజు పూర్వీకులు):
- నిమి చక్రవర్తి
- మిథి
- ఉదావసువు
- నందివర్దనుడు
- సుకేతువు
- దేవరాతుడు
- బృహధ్రతుడు కి ఇద్ధరు శూరుడు, మహావీరుడు.
- మహావీరుడు
- సుదృతి
- దృష్టకేతువు
- హర్యశృవుడు
- మరుడు
- ప్రతింధకుడు
- కీర్తిరతుడు
- దేవమీదుడు
- విభుదుడు
- మహీద్రకుడు
- కీర్తిరాతుడు
- మహారోముడు
- స్వర్ణరోముడు
- హ్రస్వరోముడు కి ఇద్దరు. జనకుడు, కుశద్వజుడు.
- జనకుడు సీత, ఊర్మిళ
- కుశద్వజుడు మాంఢవి, శృతకీర్తి
శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణోత్సవములో ఉచ్చరించ వలసిన కళ్యాణ ప్రవరలు.
శ్రీరామ ప్రవర:-
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.
వాసిష్ఠ ఐంద్ర ప్రమధ త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ,
నాభాగ మహారాజ వర్మణో నప్త్రే…
అజ మహారాజ వర్మణః పౌత్రాయ…
దశరథ మహారాజ వర్మణః పుత్రాయ…
శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.
సీతాదేవి ప్రవర:-
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం,
స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం…
హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం…
జనక మహారాజ వర్మణః పుత్రీం…
సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం…