పుష్య బహుళ అమావాస్య ను చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. దీనినే మౌని అమావాస్య అంటారు. ఆ రోజున భక్తులు ఉపవాసం ఉంటూ గంగస్నానం చేసి, పూజలు చేస్తారు. అయితే ఈసారి మౌని అమావాస్య ఫిబ్రవరి 9వ తేదీ, శుక్రవారం రోజున వస్తుంది. మౌని అమావాస్య చాలా పుణ్యమైనదిగా, ఫలవంతమైనదిగా చెప్తారు. అందుకే ఆ రోజున పూర్వీకుల కోసం, పితృదోషాలు తొలిగించుకోవడానికి పవిత్రమైనదిగా.. స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఉపవాసం చేస్తారు.
మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజు సాధువులు మౌనంగా ఉంటారు. దీన్ని జ్ఞానంను నిద్రలేపే చర్యగా భావించి దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తారు. ఏమీ చెప్పవలసిన అవసరం కానీ చెప్పగలిగేందుకు కూడా ఏమీ ఉండదని నమ్ముతారు. గంగానది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు. దీనివల్ల ఆరోజు స్నానం చేయటానికి గంగానది ముఖ్యమైన నదిగా మారింది.
గంగా నదిలో స్నానం అందరికీ వీలు కాదు కాబట్టి ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటికి కాశి గంగను జత చేయండి. మీరు స్నానం చేసే ముందు ఏ మంత్రాన్ని చదవవచ్చు.
‘గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి,
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధుం కురు’
పై మంత్రం భారత ఉపఖండంలోని అన్ని పవిత్రనదుల ఆశీర్వాదాన్ని మరియు తమ అంశలను మీ స్నానం చేసే నీటిలో చేరేలా చేస్తుంది.
మౌని అమావాస్య నాడు శనేశ్వరుడిని కూడా పూజిస్తారు. ప్రజలు నువ్వులు నూనెతో ఈ రోజు శనేశ్వరుడికి అభిషేకం చేస్తారు. చంద్రుడితో సంబంధం ఉన్నందున రుద్రాక్షమాలను ఈరోజు మీరు ధరించవచ్చు. కాకపోతే రుద్రాక్షలు ద్విముఖి లేదా పదహారు ముఖి అయివుండాలి. ఇవి వేసుకున్నవారికి ఆందోళన తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది.
జంతువులకి ఆహారం పెట్టడం కుక్కలు, ఆవులు మరియు కాకుల వంటి జంతువులకి ఈరోజు ఆహారం పెట్టడం పవిత్రంగా భావిస్తారు. ఈరోజు కొంత డబ్బును మీరు పేదలు మరియు అవసరమైనవారికి దానం చేయాలి. జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం, బట్టలు ఇవ్వవచ్చు.
Significance of Mouni Amavasya