అనంత పద్మనాభ వ్రతం | పద్మనాభ వ్రత విధానము | అనంతపద్మనాభ స్వామి వ్రత కథ

Loading

anantha-padmanabha-swamy-vratham-pooja-procedure

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

అనంత పద్మనాభ వ్రతం:

అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశినాడు జరుపుకోవాలి. ఈ వ్రతాన్ని అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం అని అంటారు. కామ్య సిద్ధి కోసం చేసే వ్రతాలలో కెల్లా అనంత పద్మనాభ స్వామి వ్రతం ప్రధానమైనదిగా హిందూ సంప్రదాయంలో ఉన్న వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించడంవల్ల సకల సంపదలు చేకూరడంతో పాటుగా కష్టాలలో ఉన్నవారు కూడా బయటపడటానికి తరుణోపాయంగా ఉపయోగపడును.

శ్రీకృష్ణ భగవానుడంతటివాడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో పాండవులకు అనంత పద్మనాభ వ్రతాన్ని వివరించినాడని పురాణాలు పేర్కొన్నాయి.

పద్మనాభ వ్రత విధానము: 
ముందుగా ఈ వ్రతాన్ని ఆచరించదలచిన వారు శుభ్రంగా తలస్నానం చేసి, ఇంటిని మరియు పూజామందిరమును శుభ్రపరుచుకోవాలి. తరువాత ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకొని, అందులో దర్బలతో చేసిన, పధ్నాలుగు పడగలు కలిగిన అనంత పద్మనాభుడిని తయారుచేసి ప్రతిష్టించాలి.

ప్రధానంగా గణపతి పూజను చేసి, అనంతరం నవగ్రహ-అష్టదిక్పాలక ఆరాధన చేయాలి. తరువాత ‘యమునా పూజ’ చేయాలి. యమునా పూజ అంటే, ఒక బిందెతో లేదా చెంబుతో నీటిని తెచ్చుకొని, అందులోకి  యమునా నది దేవతను ఆవాహనం చేసి పూజించాలి. తరువాత అనంత పద్మనాభ స్వామి వారికి షోడశోపచార పూజను చేసి, ఒకొక్క రకము 14చొప్పున 14రకముల పదార్ధాలను నైవేద్యముగా సమర్పించాలి. వ్రతకథా శ్రవణం చేసి, అనంతపద్మనాభస్వామికి నమస్కరించి కథా అక్షతలు శిరస్సున ధరించాలి. వ్రతములో భాగంగా ఎరుపు రంగులో పద్నాలుగు పోచలతో తయారు చేసిన తోరాన్ని ధరించాలి.

శ్రీ పసుపు గణపతి పూజ:

శ్లో || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే

(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)

శ్లో || అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

(గంటను మ్రోగించవలెను)

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,

(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

  • ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,
  • మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,
  • వామనాయ నమః, శ్రీధరాయ నమః,
  • ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
  • దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
  • వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
  • అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
  • అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
  • అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
  • ఉపేంద్రాయ నమః, హరయే నమః,
  • శ్రీ కృష్ణాయ నమః

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ ||
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః
యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే ||

  • శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః
  • వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః
  • అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః
  • నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః
  • అయం ముహూర్తస్సుముహోర్తస్తు

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ప్రాణాయామము

(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

సంకల్పం:

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ద్యర్థం, ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీమత్ అనంత పద్మనాభ  స్వామీ  దేవతా ముద్దిశ్య శ్రీఅనంత పద్మనాభ  స్వామీ దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే

కలశారాధనం:

శ్లో || కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.)

శ్లో || గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం || ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి

(అక్షతలు వేయవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి

(గంధం చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాధిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.
మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి

(అగరవత్తుల ధుపం చూపించవలెను.)

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

(బెల్లం ముక్కను నివేదన చేయాలి)

ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

(నీరు వదలాలి.)

తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.

(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)

ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు

(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)

తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.

శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.

(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)

యమునా పూజ

ధ్యానం: 
శ్లో: క్షీరోదార్ణవ సంభూతే ఇంద్రనీల సమప్రభే,
ధ్యానం కరోమి యమునే విష్ణురూపి నమోస్తుతే.
యమునాదేవ్యై నమః ధ్యానం సమర్పయామి.

ఆవాహనం:
శ్లో: యమునేతే నమస్తుభ్యం సర్వ కామ ప్రదాయిని,
ఆవాహయామి భక్త్యా త్వాం సాన్నిధ్యం కురు సువ్రతే.
యమునాదేవ్యై నమః ఆవాహయామి.

ఆసనం:  
శ్లో:నమస్కరోమి యమునే సర్వపాపా ప్రణాశిని
రత్నసింహాసనం దేవే స్వీకురుష్వ మయార్పితం.
యమునాదేవ్యై నమః ఆసనం సమర్పయామి.

పాద్యం: 
శ్లో: సింహాసన సమారూడే దేవశక్తి సమన్వితే,
పాద్యం గృహాణ దేవేశి సర్వలక్షణ సంయుతే.
యమునాదేవ్యై నమః పాద్యం సమర్పయామి.

అర్ఘ్యం:
శ్లో: నందిపాడే నమస్తుభ్యం సర్వపాప నివారిణి,
అర్ఘ్యం గృహాణ యమునే మద్దత్త మిదముత్తమం.
యమునాదేవ్యై నమఃఅర్ఘ్యం సమర్పయామి.

ఆచమనీయం:
శ్లో: హారవైడూర్య సంయుక్తే సర్వలోకహితే శివే,
గృహాణాచమనీయం దేవి శంకరార్ధ షరీరిణి .
యమునాదేవ్యై నమఃఆచమనీయం సమర్పయామి.

స్నానం:
శ్లో: దేవసలిలే నమస్తుభ్యం సర్వలోక హితేప్రియే
సర్వపాప ప్రశమని తున్గాభాద్రే నమోస్తుతే.
యమునాదేవ్యై నమః స్నానం సమర్పయామి.

వస్త్రయుగ్మం:
శ్లో: గురుపాదే నమస్తుభ్యం సర్వలక్షణ సంయుతే,
సువ్రతం కురుమే దేవి తుంగభద్రే  నమోస్తుతే.
యమునాదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

మధుపర్కం: 
శ్లో: కృష్ణవేణి నమస్తుభ్యం కృష్ణవేణి సులక్షణే
మధుపర్కం గృహాణేదం మయాదత్తం శుభప్రదే.
యమునాదేవ్యై నమఃమధుపర్కం సమర్పయామి.

ఆభరనాణి :
శ్లో: నందిపాదే నమస్తుభ్యం శంకరార్ధ షరీరిణి
సర్వలోకహితే తుభ్యం భీమరధ్యై నమోస్తుతే.
యమునాదేవ్యై నమః ఆభరనాణి సమర్పయామి.

గంధం:
శ్లో: కృష్ణ పాద సమద్భూతే గంగేత్రిపద గామిని,
జటాజూట సమదూతే సర్వకామఫలప్రదే.
యమునాదేవ్యై నమః గంధం సమర్పయామి.

అక్షతలు:  
శ్లో: గోదావరి నమస్తుభ్యం సర్వాభీష్ట ప్రదాయిని,
స్వీకురుష్వ జగద్వంద్యే అక్షతాన్ నమలాన్ శుభాన్.
యమునాదేవ్యై నమఃఅక్షతాన్ సమర్పయామి.

పుష్పై పూజ:
శ్లో: మందారై పారిజాతైస్చ పాటలాశోక చంపకై
పూజయామి తవప్రీత్యై వందే భక్త వత్సలే .
యమునాదేవ్యై నమః పుష్పాణి పూజయామి.

అధాంగ పూజ:
ఓం చంచలాయై నమః  –  పాదౌ పూజయామి
ఓం సుజంఘాయ నమః –  జంఘే పూజయామి
ఓం చపలాయై నమః – జానునీ పూజయామి
ఓం పుణ్యాయై నమః – ఊరూం పూజయామి
ఓం కమలాయై నమః – కటిం పూజయామి
ఓం గోదావర్యై నమః  – స్థనౌ పూజయామి
ఓం భవనాశిన్యై నమః – కంటం  పూజయామి
ఓం తుంగ భద్రాయై నమః – ముఖం పూజయామి
ఓం సుందర్యై నమః – లలాటం పూజయామి
ఓం దేవ్యై నమః – నేత్రే పూజయామి
ఓం పుణ్య శ్రవణ కీర్తనాయై నమః – కర్ణౌ పూజయామి
ఓం సునాసికాయై నమః – నాసికాం పూజయామి
ఓం భాగీరధ్యై నమః – శిరః పూజయామి
ఓం యమునాదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి.

ధూపం:
శ్లో: దశాంగం గగ్గులోపెతం చందనాగరు సంయుతం
యమునాయై నమస్తుభ్యం దూపోయం ప్రతిగృహ్యాతాం.
యమునాదేవ్యై నమఃధూపం సమర్పయామి.

దీపం:
శ్లో: ఘ్రుతవర్తి సమాయుక్తం త్రైలోక్యతిమిరాపహం
గృహాణ మంగళం దీపం సర్వేశ్వరీ నమోస్తుతే.
యమునాదేవ్యై నమఃదీపం దర్శయామి.

నైవేద్యం:
శ్లో: భక్ష్యైస్చ భోజ్యైస్చ రాసి షడ్బిస్సమంవితం
నైవేద్యం గృహ్యాతాం దేవీ యమునాయై నమోనమః
యమునాదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి.

తాంబూలం: 
శ్లో: కర్పూర వాసితం చూర్ణం క్రముకాద్యై స్సమన్వితం
తాంబూలం గృహ్యాతాం దేవీ యమునాయై నమోస్తుతే.
యమునాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి
నీరాజనం, మంత్రపుష్పం, నమస్కారాన్ సమర్పయామి.

యమునా పూజ

ధ్యానం: 
శ్లో: క్షీరోదార్ణవ సంభూతే ఇంద్రనీల సమప్రభే,
ధ్యానం కరోమి యమునే విష్ణురూపి నమోస్తుతే.
యమునాదేవ్యై నమః ధ్యానం సమర్పయామి.

ఆవాహనం:
శ్లో: యమునేతే నమస్తుభ్యం సర్వ కామ ప్రదాయిని,
ఆవాహయామి భక్త్యా త్వాం సాన్నిధ్యం కురు సువ్రతే.
యమునాదేవ్యై నమః ఆవాహయామి.

ఆసనం:  
శ్లో:నమస్కరోమి యమునే సర్వపాపా ప్రణాశిని
రత్నసింహాసనం దేవే స్వీకురుష్వ మయార్పితం.
యమునాదేవ్యై నమః ఆసనం సమర్పయామి.

పాద్యం: 
శ్లో: సింహాసన సమారూడే దేవశక్తి సమన్వితే,
పాద్యం గృహాణ దేవేశి సర్వలక్షణ సంయుతే.
యమునాదేవ్యై నమః పాద్యం సమర్పయామి.

అర్ఘ్యం:
శ్లో: నందిపాడే నమస్తుభ్యం సర్వపాప నివారిణి,
అర్ఘ్యం గృహాణ యమునే మద్దత్త మిదముత్తమం.
యమునాదేవ్యై నమఃఅర్ఘ్యం సమర్పయామి.

ఆచమనీయం:
శ్లో: హారవైడూర్య సంయుక్తే సర్వలోకహితే శివే,
గృహాణాచమనీయం దేవి శంకరార్ధ షరీరిణి .
యమునాదేవ్యై నమఃఆచమనీయం సమర్పయామి.

స్నానం:
శ్లో: దేవసలిలే నమస్తుభ్యం సర్వలోక హితేప్రియే
సర్వపాప ప్రశమని తున్గాభాద్రే నమోస్తుతే.
యమునాదేవ్యై నమః స్నానం సమర్పయామి.

వస్త్రయుగ్మం:
శ్లో: గురుపాదే నమస్తుభ్యం సర్వలక్షణ సంయుతే,
సువ్రతం కురుమే దేవి తుంగభద్రే  నమోస్తుతే.
యమునాదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

మధుపర్కం: 
శ్లో: కృష్ణవేణి నమస్తుభ్యం కృష్ణవేణి సులక్షణే
మధుపర్కం గృహాణేదం మయాదత్తం శుభప్రదే.
యమునాదేవ్యై నమఃమధుపర్కం సమర్పయామి.

ఆభరనాణి :
శ్లో: నందిపాదే నమస్తుభ్యం శంకరార్ధ షరీరిణి
సర్వలోకహితే తుభ్యం భీమరధ్యై నమోస్తుతే.
యమునాదేవ్యై నమః ఆభరనాణి సమర్పయామి.

గంధం:
శ్లో: కృష్ణ పాద సమద్భూతే గంగేత్రిపద గామిని,
జటాజూట సమదూతే సర్వకామఫలప్రదే.
యమునాదేవ్యై నమః గంధం సమర్పయామి.

అక్షతలు:  
శ్లో: గోదావరి నమస్తుభ్యం సర్వాభీష్ట ప్రదాయిని,
స్వీకురుష్వ జగద్వంద్యే అక్షతాన్ నమలాన్ శుభాన్.
యమునాదేవ్యై నమఃఅక్షతాన్ సమర్పయామి.

పుష్పై పూజ:
శ్లో: మందారై పారిజాతైస్చ పాటలాశోక చంపకై
పూజయామి తవప్రీత్యై వందే భక్త వత్సలే .
యమునాదేవ్యై నమః పుష్పాణి పూజయామి.

అధాంగ పూజ:
ఓం చంచలాయై నమః  –  పాదౌ పూజయామి
ఓం సుజంఘాయ నమః –  జంఘే పూజయామి
ఓం చపలాయై నమః – జానునీ పూజయామి
ఓం పుణ్యాయై నమః – ఊరూం పూజయామి
ఓం కమలాయై నమః – కటిం పూజయామి
ఓం గోదావర్యై నమః  – స్థనౌ పూజయామి
ఓం భవనాశిన్యై నమః – కంటం  పూజయామి
ఓం తుంగ భద్రాయై నమః – ముఖం పూజయామి
ఓం సుందర్యై నమః – లలాటం పూజయామి
ఓం దేవ్యై నమః – నేత్రే పూజయామి
ఓం పుణ్య శ్రవణ కీర్తనాయై నమః – కర్ణౌ పూజయామి
ఓం సునాసికాయై నమః – నాసికాం పూజయామి
ఓం భాగీరధ్యై నమః – శిరః పూజయామి
ఓం యమునాదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి.

ధూపం:
శ్లో: దశాంగం గగ్గులోపెతం చందనాగరు సంయుతం
యమునాయై నమస్తుభ్యం దూపోయం ప్రతిగృహ్యాతాం.
యమునాదేవ్యై నమఃధూపం సమర్పయామి.

దీపం:
శ్లో: ఘ్రుతవర్తి సమాయుక్తం త్రైలోక్యతిమిరాపహం
గృహాణ మంగళం దీపం సర్వేశ్వరీ నమోస్తుతే.
యమునాదేవ్యై నమఃదీపం దర్శయామి.

నైవేద్యం:
శ్లో: భక్ష్యైస్చ భోజ్యైస్చ రాసి షడ్బిస్సమంవితం
నైవేద్యం గృహ్యాతాం దేవీ యమునాయై నమోనమః
యమునాదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి.

తాంబూలం: 
శ్లో: కర్పూర వాసితం చూర్ణం క్రముకాద్యై స్సమన్వితం
తాంబూలం గృహ్యాతాం దేవీ యమునాయై నమోస్తుతే.
యమునాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి
నీరాజనం, మంత్రపుష్పం, నమస్కారాన్ సమర్పయామి.

అనంతపద్మనాభ వ్రత విధానము :

ముందుగా ఓ మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి . అందులో పధ్నాలుగు పడగలు గల అనంతుడుని తయారుచేసి ప్రతిస్ఠించాలి . సామానముగా దర్బలను ఉపయొగించి అనంతుణ్ణి తయారుచేస్తారు . ముందుగా గణపతిని , నవగ్రహాలను పూజించిన తరువాత ‘ యమునా పూజ ‘ చేయాలి . యమునా పూజ అంటే నీటిని పూజించాలి . బిందెతో నీటిని తెచ్చుకొని , ఆ నీటిలోకి యమునను ఆవాహనం చేసి పూజించాలి . తరువాత అనంతుడుని షోడశోపచారాలతో పూజించి , బెల్లము తో చేసిన ఇరవై ఎనిమిది అరిసెలను నైవేద్యముగా పెట్టాలి . వ్రతకథ చెప్పుకొని అనంతపద్మనాభస్వామికి నమస్కరించి అక్షతలు తలపై చల్లుకోవాలి . వ్రతముతో తోరమును కట్టుకోవాలి . ఎరుపు రంగులో పద్నాలుగు పోచలతో తయారైన తోరాన్ని ధరించాలి .

ధ్యానం:
శ్లో: క్రుత్వాదర్భ మాయం దేవం పరిధాన సమన్వితం
ఫనైసప్తభి రావిష్టం పింగాలాక్షంచ చతుర్భుజం
దక్షినాగ్రకరే పద్మం శంఖం తస్యాపధ్య కారే
చక్రమూర్ధ్యకరే హమే గదాంతస్యా పద్య కారే
అవ్యయం సర్వలోకేశం పీతాంభరధరం హరిం
అనంతపద్మనాభాయ నమః ధ్యానం సమర్పయామి

ఆవాహనం:
శ్లో: ఆగచ్చానంత దేవేశ తేజోరాశే జగత్పతే
ఇమాంమయాక్రుతం పూజాం గృహాణ సురసత్తమ.
అనంతపద్మనాభాయ నమః ఆవాహనం సర్పయామి.

ఆసనం:
శ్లో: అనంతాయ నమస్తుభ్యం సహస్ర శిరసే నమః
రత్నసింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతిగృహ్యాతాం.
అనంతపద్మనాభాయ నమః ఆసనం సమర్పయామి.

తోరస్తాపనం:
శ్లో: తస్యాగ్రతో దృడం సూత్రం కుంకుమాక్తం సుదోరకం
చతుర్దశి గ్రంధి సంయుక్తం వుపకల్ప్య ప్రజాజాయే
అనంతపద్మనాభాయ నమఃతోరస్తాపనం కరిష్యామి.

అర్ఘ్యం:
శ్లో: అనంతగుణ రత్నాయ విశ్వరూప ధరాయ చ
అర్ఘ్యం దదామితెదేవ నాగాదిపతయే నమః
అనంతపద్మనాభాయ నమః అర్ఘ్యం సర్పయామి.

పాద్యం:
శ్లో: సర్వాత్మన్ సర్వలోకేశ సర్వవ్యాపిన్ సనాతన
పాద్యం గృహాణ భగవాన్ దివ్యరూప నమోస్తుతే
అనంతపద్మనాభాయ నమః పాద్యం సమర్పయామి.

ఆచమనీయం:
శ్లో: దామోదర నమోస్తుతే నరకార్ణవతారక
గృహాణాచమనీయం దేవ మయాదత్తం హి కేశవా.
అనంతపద్మనాభాయ నమః ఆచమనీయం సమర్పయామి.

మధుపర్కం:
శ్లో: అనంతానంత దేవేశ అనంత ఫలదాయక
దధి మద్వాజ్య నమిశ్రం మధుపర్కం దదామితే
అనంతపద్మనాభాయ నమః మధుపర్కం సమర్పయామి.

పంచామృతం:
శ్లో: అనంతగుణ గంభీర విశ్వరూప ధరానమ
పంచామ్రుతైస్చ విదివ త్స్నాపయామి దయానిధే.
అనంతపద్మనాభాయ నమః పంచామృత స్నానం సమర్పయామి.

శుద్దోదక స్నానం:
శ్లో: గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
స్నానం ప్రకల్పయేతీర్ధం సర్వపాప ప్రముక్తయే
అనంతపద్మనాభాయ నమః శుద్దోదక స్నానం సమర్పయామి.

వస్త్ర యుగ్మం:
శ్లో: శ్రీధరాయ నమస్తుభ్యం విష్ణవే పరమాత్మనే
పీతాంబరం ప్రదాస్యామి అనంతాయ నమోస్తుతే
అనంతపద్మనాభాయ నమఃవస్త్ర యుగమ సమర్పయామి.

యజ్ఞోపవీతం:
శ్లో: నారాయణ నమోస్తుతే త్రాహిం మాం భావసాగారాట్
బ్రహ్మ సూత్రం చోత్తరీయం గృహాణ పురుషోత్తమ.
అనంతపద్మనాభాయ నమఃయజ్ఞోపవీతం సమర్పయామి.

గంధం:
శ్లో: శ్రీగంధం చందనోన్మిశ్రమం కుంకుమాధీ భిరన్వితం
విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్ధం ప్రతిగృహ్యాతాం.
అనంతపద్మనాభాయ నమః గంధం సమర్పయామి.

అక్షతాన్:
శ్లో: శాలియాన్ తండులాన్ రంయాన్ మయాదత్తాన్ శుభావహాన్
అచ్యుతానంత గోవింద అక్షతాన్ స్వీ కురుశ్వా ప్రభో
అనంతపద్మనాభాయ నమః అక్షతాన్ సమర్పయామి

పుష్పపూజ:
శ్లో: కరవీరై ర్జాతికుసుమై శ్చమ్పకై ర్వకులైశుభై
శాతపత్రైశ్చ కల్హారై రర్చయే పురుషోత్తమ.
అనంతపద్మనాభాయ నమః పుష్పాణి పూజయామి.

అధాంగ పూజ:
ఓం అనంతాయ నమః – పాదౌ పూజయామి
ఓం శేషయ నమః – గుల్భౌ పూజయామి
ఓంకాలాత్మనేనమః – జంఘే పూజయామి
ఓం విశ్వరూపాయనమః – జానునీ పూజయామి
ఓం జగన్నాదాయ నమః – గుహ్యం పూజయామి
ఓం పద్మనాభాయ నమః – నాభిం పూజయామి
ఓం సర్వాత్మనే నమః – కుక్షిం పూజయామి
ఓం శ్రీ వత్సవక్షసే నమః – వక్షస్థలం పూజయామి
ఓం చక్రహస్తాయ నమః – హస్తాన్ పూజయామి
ఓం ఆజానుబాహవే నమః – బాహూన్ పూజయామి
ఓం శ్రీ కంటాయ నమః – కంటం పూజయామి
ఓం చంద్రముఖాయ నమః – ముఖం పూజయామి
ఓం వాచాస్పతయే నమః – వక్త్రం పూజయామి.
ఓం కేశవాయ నమః – నాసికాం పూజయామి
ఓం నారాయణాయ నమః – నేత్రే పూజయామి
ఓం గోవిందాయ నమః – శ్రోత్రే పూజయామి
ఓం అనంతపద్మనాభాయ నమః – శిరః పూజయామి
ఓం విష్ణవే నమః – సర్వాంగణ్యాని పూజయామి

అనంతపద్మనాభ స్వామి అష్ట్తోతరము
ఓం శ్రీకృష్ణాయ నమః
ఓం కమలానాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుషవిగ్రహాయ నమః
ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరయే నమః
ఓం చ్తుర్భుజాత్తచక్రాసిగదా శంఖాంబుజాయుధాయ నమః
ఓం దేవకీనందనాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం నందగోపప్రియాత్మజాయ నమః
ఓం యమునావేగసంహారిణే నమః
ఓం బలభద్రప్రియానుజాయ నమః
ఓం పూతనాజీవితహరణాయ నమః
ఓం శకటాసురభంజనాయ నమః
ఓం నందవ్రజజనానందినే నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
ఓం నవనీతవిలిప్తాంగాయ నమః
ఓం నవనీతనటాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం నవనీతనవాహారాయ నమః
ఓం ముచుకుందప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః
ఓం త్రిభంగినే నమః
ఓం మధురాకృతయే నమః
ఓం శుకవాగమృతాబ్ధీందనే నమః
ఓం గోవిందాయ నమః
ఓం యోగినాంపతయే నమః
ఓం వత్సవాటచరాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం ధేనుకసురభంజనాయ నమః
ఓం తృణీకృతతృణావర్తాయ నమః
ఓం యమళార్జునభంజనాయ నమః
ఓం ఉత్తాలోత్తాలభేత్రే నమః
ఓం తమాలశ్యామలాకృతాయే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
ఓం కోటిసూర్యసమప్రభాయ నమః
ఓం ఇళాపతయే నమః
ఓం పరంజ్యొతిషే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం యాదూద్వహాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవాససే నమః
ఓం పారిజాతాపహరకాయ నమః
ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వపాలకాయ నమః
ఓం అజాయ నమః
ఓం నిరంజనాయ నమః ఓం కామజనకాయ నమః
ఓం కంజలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాథాయ నమఃఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః
ఓం బృందావనాంతసంచారిణే నమః
ఓం తులసీదామభూషణాయ నమః
ఓం శ్యమంతమణిహర్త్రే నమః
ఓం నరనారాయణాత్మకాయ నమః
ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమపూరుషాయ నమః
ఓం ముష్టికాసురచాణూర మల్లయుద్ధ విశారదాయ నమః
ఓం సంసారవైరిణే నమః
ఓం మురారినే నమః
ఓం నరకాంతకాయ నమః
ఓం అనాదిబ్రహ్మచారిణే నమః
ఓం కృష్ణావ్యసనకర్మకాయ నమః
ఓం శిశుపాలశిరచ్చేత్రే నమః
ఓం దుర్యోధనకులాంతకృతే నమః
ఓం విదురాక్రూరవరదాయ నమః
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచయే నమః
ఓం సత్యసంకల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః
ఓం జయినే నమః
ఓం సుభద్రాపూర్వజాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వేణునాదవిశారదాయ నమః
ఓం వృషభాసురవిధ్వంసినే నమః
ఓం బాణాసురకరాంతకృతే నమః
ఓం యుధిష్ఠరప్రతిష్ఠాత్రే నమః
ఓం బర్హిబర్హవతంసకాయ నమః
ఓం పార్థసారధియే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం శ్రీహూదధయేగీతామృతమ నమః
ఓం కాళీయఫణిమాణిక్యరంజిత శ్రీపదాంబుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్ఞభోక్త్రే నమః
ఓం దానవేంద్రవినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పన్నాగాశనవాహనాయ నమః
ఓం జలక్రీడాసమాసక్తగోపీ వస్త్రాపహారకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పన్నాగాశనవాహనాయ నమః
ఓం జలక్రీడాసమాసక్తగోపి వస్త్రాపహారకాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం తీర్ధకృతే నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వతీర్ధాత్మకాయ నమః
ఓం సర్వగ్రహరూపిణే నమః
ఓం పరాత్పరాయ నమః

తోరగ్రదిం పూజ:
ఓం కృష్ణాయ నమః – ప్రధమ గ్రంధిం పూజయామి
ఓం విష్ణవే నమః – ద్వితీయగ్రంధింపూజయామి
ఓం జిష్ణవే నమః – తృతీయగ్రంధింపూజయామి
ఓం కాలాయ నమః – చతుర్ధగ్రంధింపూజయామి
ఓం బ్రహ్మనే నమః – పంచమగ్రంధింపూజయామి
ఓం భాస్కరాయ నమః – షష్టమగ్రంధింపూజయామి
ఓం శేషయ నమః – సప్తమగ్రంధింపూజయామి
ఓం సోమాయ నమః – అష్టమగ్రంధింపూజయామి
ఓం ఈశ్వరాయ నమః – నవమగ్రంధింపూజయామి
ఓం విశ్వాత్మనే నమః – దశమగ్రంధింపూజయామి
ఓం మహాకాలాయ నమః – ఏకాదశగ్రంధింపూజయామి
ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః – ద్వాదశగ్రంధింపూజయామి
ఓం అచ్యుతాయ నమః – త్రయోదశగ్రంధింపూజయామి
ఓం అనంతపద్మనాభాయ నమః – చతుర్దశగ్రంధింపూజయామి

ధూపం:
శ్లో: వనస్పతి రసైర్దివ్యై ర్నానా గంధైశ్చ సంయుతం
ఆఘ్రేయ సర్వదేవానాం దూపోయం ప్రతిగృహ్యాతాం
ఓం అనంతపద్మనాభాయ నమఃదూపమాఘ్రాపయామి.

దీపం:
శ్లో: సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్హినాం యోజినామ్మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపాహం
ఓం అనంతపద్మనాభాయ నమఃదీపం దర్శయామి.

నైవేద్యం:
శ్లో: నైవేద్య గృహ్య దేవేశ భక్తిమే హ్యచాలాంకురు
ఈప్సితం మే వరం దేవహి పరత్రచ పరాం గతిం
అన్నం చతుర్విధం భక్ష్యై రసై షడ్భి సమన్వితం
మయానివేదితం తుభ్యం స్వీకురుష్వ జనార్ధన.
ఓం అనంతపద్మనాభాయ నమఃనైవేద్యం సమర్పయామి.

తాంబూలం:
శ్లో: ఫూగీ ఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం
కర్పూర చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం.
ఓం అనంతపద్మనాభాయ నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనం:
శ్లో: సమ సర్వహితార్దాయ జగదాధార మూర్తయే
సృష్టి స్తిత్యంత్యరూపాయ అనంతాయ నమోనమః
ఓం అనంతపద్మనాభాయ నమఃనీరాజనం సమర్పయామి.

ప్రదక్షిణ నమస్కారాన్:
శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రనస్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ
త్రాహిమాం క్రుపయాదేవ శరణాగత వత్సల
అన్యధా శరణంనాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్ధన
నమస్తే దేవేదేవేశ నమస్తే ధరణీధర
నమస్తే సర్వానాగేంద్ర నమస్తే పురుషోత్తమ.
ఓం అనంతపద్మనాభాయ నమః ప్రదిక్షణ నమస్కారాన్ సమర్పయామి.

తోరగ్రహణం:
శ్లో: దారిద్ర్య నాశానార్దాయ పుత్ర పౌత్ర ప్రవ్రుద్దయే
అనంతాఖ్య మేడం సూత్రం దారయామ్యః ముత్తమం
ఓం అనంతపద్మనాభాయ నమఃతోరగ్రహణం కరిష్యామి.

తోరనమస్కారం:
శ్లో: అనంత సంసార సముద్ర
మాగ్నం మమభ్యుద్దర వాసుదేవ
అనంతరూపిన్ వినియోజయస్వ
హ్యనంత సూత్రాయ నమోస్తుతే
ఓం అనంతపద్మనాభాయ నమఃతోరనమస్కారాన్ సమర్పయామి.

తోరబంధనం:
సంసార గాహ్వారగుహాసు సుఖం విహర్తుం
వాన్చంతి ఏ కురు కులోద్వః శుద్దసత్వా
సంపూజ్యచ త్రిభువనేశ మనంతరూపం
బద్నంతి దక్షణ కారే వరదోరకం తే.
ఓం అనంతపద్మనాభాయ నమః టోర బంధనం కరిష్యామి.

జీర్నతోరణం విసర్జనం:
శ్లో: అనంతానంత దేవేశ హ్యనంత ఫలదాయక
సూత్రగ్రందిషు సంస్థాయ విశ్వరూపాయతే నమః
ఉపాయనదానం :
శ్లో: అనంతః ప్రతిగ్రుహ్న్నతి అనంతోవై దదాతిచ
అనంత స్తారకోభాభ్యా మనంతాయ నమోనమః

అనంతపద్మనాభ వ్రత కథ

సూతపౌరాణికుడు శౌనకాది మహర్షులను గాంచి యిట్లనియె! ఓ మునిశ్రేష్టులారా! లోకమున మనుష్యులు దారిద్ర్యముచే పీడింపబడుచున్డిరి . అట్టి దారిద్ర్యమును తోలగాచేయునట్టి ఒక వ్రత శ్రేష్టంబు కలదు. దానిని జెప్పెద వినుడు. పూర్వము పాండురాజు పుత్రుడైన ధర్మరాజు తమ్ములతోడ అరణ్య వాసము చేయుచు అన్నో కష్టములను అనుభవించి ఒకనాడు శ్రీకృష్ణుని గాంచి “ఓ మహాత్మా! నేను తమ్ములతో కలసి అనేక దినములుగా అరణ్య వాసము చేయుచూ ఎన్నో కష్టములను అనుభవించుచున్నాను. ఇట్టి కష్టసాగారము నందుండి కడతేరునట్టి వుపాయమును చెప్పవలేయునని ప్రాధించిన శ్రీకృష్ణుడు యిట్లనియె.
“ఓ ధర్మరాజ! పురుషునకును, స్త్రీలకును సకల పాపంబుల పోగొట్టి సకల కార్యముల సమకూర్చునట్టి అనంత వ్రాతమను ఒక వ్రతము కలదు. మరియు ఆ అనంత వ్రతమును భాద్రపద శుక్ల చతుర్దశినాడు చేయవలెయును. అట్లు గావించిన కీర్తియును, సుఖమును, శుభమును, పుత్రలాభమును గలుగును” అని వచించిన ధర్మరాజు యిట్లనియె.
“ఓ రుక్మిణీ ప్రానవల్లభా! ఆ అనంతుడను దైవంబు ఎవరు? అతడి ఆదిశేషుడా! లేక తక్షుడా! లేక సృష్టికర్త యైన బ్రహ్మయా! లేక పరమాత్మ స్వరూపుడా” అని అడిగిన శ్రీ కృష్ణుడు యిట్లనియె.
“ఓ పాండుపుత్ర! అనంతుదనువాడను నేనేతప్ప మరిఎవరో కాదు.సూర్య గమనముచే కలాకష్ట ముహూర్తములనియు, పగలు రాత్రనియు, యుగసంవత్సర ఋతు మాసకల్పమనియు నీ సంజ్ఞ కలుగ నొప్పుచున్న కాలము ఏది కలదో అదియే నా స్వరూపము. నేనే కాలస్వరూపుడను, అనంతుడను పేరున భూభారము తగ్గించుటకొరకును, రాక్షస సంహారము కొరకును వాసుదేవుని గృహమున జన్మించితిని. నన్ను క్రుశ్నునిగాను, విష్ణువు గాను, హరిహరబ్రహ్మలుగను, సర్వవ్యాపక పరమేశ్వర స్వరూపునిగాను, సృష్టి స్థితి లయ కారనభూతునిగాను, అనంతపద్మనాభునిగాను, మత్స్య కూర్మాద్యవతార స్వరూపునిగాను ఎరుగుదురు. ఈ నా హృదయమునందే పదునాలుగు ఇంద్రులును, అష్టావసువులును, ఏకాదశ రుద్రులును, ద్వాదశాదిత్యులును, సప్త ఋషులును, భూర్భు వస్స్వర్లోకాదులు నున్నవో అట్టి నా స్వరూపమును నీకు తెలిపితిని” అనిన ధర్మరాజు శ్రీ కృష్ణుని గాంచి ” ఓ జగన్నాధ! నీవు వచించిన అనంత వ్రతమును యేతుల ఆచరిన్చావలేయును? ఆ వ్రతము ఆచరించిన ఏమి పహలము గలుగును? ఏయే దానములు చేయవలెయును? ఈ దైవమును పూజింపవలెను? పూర్వం ఎవరైనా ఈ వ్రతం ఆచరించి సుఖము జెందిరి? అని ధర్మరాజు అడుగగా! శ్రీకృష్ణుడు యిట్లనియె.
“ఓ ధర్మరాజ! చెపాడ వినుము. పూర్వము వశిష్ట గోత్రోద్భవుడు , వేద శాస్త్ర సంపన్నుడు అగు సుమంతుడు అను ఒక బ్రాంహ్మణుడు కలదు. అతనకి భ్రుగుమహర్షి పుత్రికయగు దీక్షాదేవి అను భార్య కలదు. ఆ దీక్షాదేవితో సుమంతుడు సంతోషముగా కాపురము చేయుచుండగా కొంత కాలమునకు దీక్షాదేవి గర్భము దాల్చి సుగునవతియగు ఒక కన్యను గనెను. ఆ బాలికకు షీలా అను నామకరణము చేసిరి.
ఇట్లు వుండగా కొన్ని రోజులకు దీక్షాదేవి తాప జ్వరముచే మృతిచెందెను. పిదప సుమంతుడు వైదిక కర్మలోప భయంబుచే కర్కశ యను ఒక కన్యను వివాహము చేసుకొనెను. ఆ కర్కశ ఎంతో కటిన చిత్తురాలుగాను, గయ్యాలిగాను, కలహాకారిణి గాను, ఉండెను. ఇట్లుండ మొదటి భార్యయగు దీక్షాదేవి పుత్రికయైన శీల తండ్రి గృహముననే పెరుగుచూ, గోడల యందును, గడపలయందును, చిత్రవర్ణంబులతో ప్రతిమలను వ్రాయుచు, కూటము మొదలగు స్థాలములయండు శంఖ పద్మాదులవలె మ్రుగ్గులు పెట్టిచు దైవభక్తిగలదై యుండెను. ఇట్లుండగా ఆశీలకు వివాహ వయసు వచ్చినది. అప్పుడు సుమంతుడు కౌండిన్య మహాముని కొన్నిదినములు తపస్సుచేసి, పిదప పెండ్లి చేసుకోవలేయునని కోరికగలిగి దేశదేశములను తిరుగుచూ ఈ సుమంతుని గృహమునకు వచ్చెను. అంత సుమంతుడు కౌండిన్య మహామునికి అర్ఘ్యపాద్యములచే పూజించి శుభదినమున ఆ మహామునికి తన కుమార్తె యగు శీలను ఇచ్చి వివాహము చేసెను. ఇట్లు వివాహము జరిగిన పిమ్మట సుమంతుడు అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వదలచి తన భార్య యగు కర్కశ వద్దకు పోయి “ఓ ప్రియురాలా! మన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వవలేయునుగాడా! ఏమి ఇద్దాము అని అడుగగా, ఆ కర్కశ చివుక్కున లేచి లూపలికి వెళ్ళి తలుపులు గడియవేసుకొని ఇక్కడ ఏమియు లేదు పొమ్మనెను. అంత సుమంతుడు ఎంతో చింతించి దారి బట్టేమునకైన ఇవ్వకుండా పంపుట మంచిది కాదని తలచి పెండ్లికి చేయబడి మిగిలిన పెలపుపిండి ఇచ్చి అల్లుడితోనిచ్చి కూతురుని పంపెను. అంత కౌదిన్యుడును సదాచార సంపన్నురాలగు భార్యతోడను బండిఎక్కి తిన్నగా తన ఆశ్రమమునకు బోవుచూ మధ్యాహ్నవేళ అయినందున సంధ్యావందనాది క్రియలు జరుపుటకై బండిదిగి తటాకంబునకేగెను. నాటిదినమున అనంతపద్మనాభ చతుర్దశి గావున అచ్చట ఒక ప్రదేశమునందు అనేక మంది స్త్రీలు యెర్రని వస్త్రములను ధరించుకొని ఎంతో భక్తిశ్రద్దలతో అనంత పద్మనాభ వ్రతము చేయుచుండగా కౌదిన్యుని భార్య యగు శీల అది చూచి మెల్లగా ఆ స్త్రీల యొద్దకు వెళ్ళి, “ఓ వనితామణులారా! మీరు ఎదేవుని పూజించుచున్నారు? ఈ వ్రతము పేరేమి? నాకు సవిస్తారముగా తెలుపగలరు అని ప్రార్ధించగా, ఆ పతివ్రతలు యిట్లనిరి. “ఓ పుణ్యవతి చెప్పెదము వినుము. ఇది అనంత పద్మనాభ వ్రతము. ఈ వ్రతమును చేసినచో అనేక ఫలములు కలుగును.
భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరమునకు పోయి స్నానము చేసి శుబ్రమైన వస్త్రములను కట్టుకొని పరిశుద్దమైన స్థలమును గోమయమునచే అలికి సర్వతో భాద్రంబాను ఎనమిది దళములు గల తమ పుష్పము వంటి మండలమును నిర్మించి, ఆ మండలమునకు చుట్టునూ పంచవర్ణపు ముగ్గులతోను, తెల్లని బియ్యపు పిండిచేతను అలంకరించి నానావిధ ముగ్గులను పెట్టి ఆవేదికకు దక్షిణ పార్శ్వమున వుదకపూరిత కలశంబు నుంచి ఆ వేదిక నడుమ సర్వవ్యాపకున్దయినా అనంత పద్మనాభస్వామిని దర్భతో ఏర్పరచి అందు ఆవాహనము చేసి.
శ్లో:

క్రుత్వాదర్భామయం దేవం శ్వేతద్వీపే స్థితం హరిం,

సమన్వితం సప్తఫణై పింగాలాక్షం చతుర్భుజం.
అను ఈ శ్లోకము చేత శ్వేత ద్వీపవాసియగు, పిన్గాలాక్షుడగు, సప్తఫణి సాహితున్డగు, శంఖ చక్ర గదా ధరున్డుగాను ధ్యానము చేసి, కల్పోక్త ప్రకారముగా షోడశోపచార పూజ చేసి, ప్రదక్షిణ నమస్కారములు గావించి, పదునాలుగు ముళ్ళు గలిగి కుంకుమతో తడసిన క్రొత్త తోరంబును ఆ పద్మనాభ స్వామి సమీపమున వుంచి పూజించి అయిడుపల్ల గోధుమపిండితో ఇరువది ఎనమిది అతిరసములన్ జేసి నైవేద్యము పెట్టి తోరంబు గట్టుకొని పదునాలుగు అతిరసములను బ్రాహ్మణులకు పాయసదానము ఇచ్చి తక్కిన వానిని తాను భుజిమ్పవలేయును. మరియు పూజాద్రవ్యములన్నియు పడులాలుగేసి వుండవలేయును. పిదపబ్రాహ్మణ సమారాధన మొనర్చి అనంతపద్మనాభ స్వామిని ధ్యానించుచు నున్దవలేయును. ఓ శీలా! ఇట్లు వ్రతము పరిసమాప్తముచేసి ప్రతి సంవత్సరము వుద్వాసనము చేసి మరల వ్రతము ఆచరిన్చుచున్దవలెను. అని ఆ వనితామణులు చెప్పిరి. అంట ఆ షీలా తక్షణంబున స్నానం చేసి ఆ స్త్రీల సహాయముతో వ్రతము ఆచరించి తోరమును కట్టుకొని దారి బట్టేమునకుగాను తెచ్చిన సత్తుపిందిని వాయనదానమిచ్చి తానును భుజించి సంతుష్ట యై, భోజనాడులచే సంత్రుప్తుడైన తన పెనిమిటితో బండినెక్కి ఆశ్రమమునకు బోయెను.
అంతట శీల అనంత వ్రతం ఆచరించిన మహాత్యమువలన ఆ ఆశ్రమము అంతయు స్వర్ణమయముగాను, గృహం అష్ట ఐశ్వర్య యుక్తముగాను ఉండుట చూచి ఆ దంపతులు ఇరువురు సంతోషభరితులై సుఖముగానున్దిరి. శీలా-గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యాది మణిగణ ఖచిత భూషణ భూషితురాలై అతిధి సత్కారములన్ గావించుచుండెను.
అట్లుండగా ఒకనాడు దంపతులు ఇరువురు కూర్చుంది యుండగా ధర్మాత్ముండగు కౌండిన్యుడు శీల సందితమునుండు తోరముచూచి “ఓ కాంతా! నీవు సందియందొక తోరమును గట్టుకొనియున్నావుకదా! అది ఎందులకు కట్టుకొను యున్నావు? నన్ను వశ్యము చేసుకోనుతకా లేక మరియోకరిని వష్యంబు చేసుకోనుతకా అని అడిగెను. అప్పుడు షీలా ఇట్లనియె.
“ఓ ప్రాణ నాయకా! అనంతపద్మనాభస్వామిని ధరించియున్నాను. ఆదేవుని అనుగ్రహంబున వలననే మనకీ ధనదాన్యాది సంపత్తులు గలిగి యున్నవని” తెలిపెను. అప్పుడు కౌదిన్యుడు మిక్కిలి కోపోద్రిక్తుడై కండ్లెర్రజేసి అనంతుదనగా యే దేవుడు అని దూశించుచూ ఆ తోరమును త్రెంచి భాభా మండుచుండేది అగ్ని లో పదవేచెను. అంత ఆ శీల హాహాకారములు చేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తోరమును తీసుకొని వచ్చి పాలలో తడపి పెట్టెను.
పిదప కొన్ని రోజులకు కౌదిన్యుడు చేసిన ఇట్టి అపరాధమువలన అతని ఐశ్వర్యము అంతయు నశించి గోధనములు దొంగల పాలగును. గృహము అగ్నిపాలయ్యేను. మరియు గృహమునండున్న వస్తువులు ఎక్కడివి అక్కడే నశించెను. ఎవరితో మాట్లాడినాను ఆకారణముగా కలహములు వచ్చుచుండెను.
అంతటా కౌదిన్యుడు ఏమియునుదోచక దారిద్ర్యముచే పీడింపబడుచూ అడవులందు ప్రవేశించి క్షుద్భాదా పీడితుండై అనంతపద్మనాభ స్వామిపై జ్ఞాపకంబు కలిగి ఆ మహాదేవుడిని యెట్లు చూడగలనని మనసులో ధ్యానించుచూ పోయి ఒక చోట పుష్ప ఫల భారితమగు గొప్ప మామిడి చెట్టును చూచి ఆ చెట్టుపై ఒక పక్షియైనాను వ్రాలకుండుట చూచి ఆశ్చర్యం కలిగి ఆ చెట్టుతో ఇట్లనియె: ఓ వ్రుక్షరాజమా! అనంతుడను నామముగల దైవమును చూచితివా? యని అడుగగా ఆ వృక్షము నే నేరుగానని చెప్పెను.
అంత కౌండిన్యుడు మరికొంత దూరముపోయి పచ్చిగాద్దిలో ఇటుఅటు తిరుగుచున్న దూడతో గూడిన ఒక గోవును చూచి, ఓ కామధేనువా! అనంతపద్మనాభ స్వామిని చూచితివా అని అడుగగా అనంత పద్మనాభస్వామి ఎవరో నే నేరుగాను అని చెప్పెను.
పిదప కౌండిన్యుడు మరికొంత దూరమువెళ్ళి మోకాలు మత్తు పచ్చికలో నిలుచున్న ఒక వ్రుశాభామును చూచి ఓ వ్రుశాభారాజమా! అనంతపద్మనాభ స్వామి ని చూచితివా అని అడిగిన, అనంతపద్మనాభ స్వామి ఎవరో నాకు తెలియదు అనిచేప్పెను.
పిమ్మట మరికొంత దూరము పోగా ఒకచోట రమ్యమైన మనోహరమైన రెండు కొలనులు తరంగంబులతో గూదియును కమల కల్హార కుముదోత్ఫలంబుల తోడ గూదియును, హన్సకారండవ చక్రకాడులతో గూదియును, ఒక కొలనునుంది జలంబులు మరియొక కొలనుకి పోరాలుచున్డుతయును చూచి, ఓ కమలాకరంబులారా! మీరు అనంత పద్మనాభ స్వామి ని చూచితిరా యని అడిగెను. అందులకు ఆ పుష్కరినిలు మే మేరుగమని చెప్పగా, కౌండిన్యుడు మరికొంత దూరము పోగా ఒకచోట ఒక గాడిదను ఒక ఏనుగు నిలుచుని యుండెను. వాటిని జూచి మీరు అనంత పద్మనాభ స్వామిని చూచితిరా అని అడిగెను. అవి అనంతపద్మనాభ స్వామి ఎవరో మాకు తెలియదు అని సమాదానమిచ్చిరి.
అంతటా కౌదిన్యుడు ఎంతో విచారముతో బాధతో మూర్చబోయి క్రిందపడెను. అప్పుడు భగవంతుని కృప గలిగి వృద్ద బ్రాహ్ణణ రూపదారుడై కౌదిన్యుని చెంతకు వచ్చి ” ఓ విప్రోత్తమా! ఇటు రమ్మని పిలుచుకొని తన గృహమునకు తీసుకపోఎను. అంతటా ఆ గృహము నవరత్న మణిగణ ఖచితంబగు దేవాంగనల తోడ గూడియు ఉండుట చూచి ఆశ్చర్యంబు చెంది, సదా గరుడ సేవితున్డుగాను, శంఖ చక్ర ధరున్డుగాను నుండు తన స్వస్వరూపమును పద్మనాభ స్వామి చూపించిన కౌండిన్యుడు సంతోష సాగారమగ్నున్డై భగవంతుని ఈ విధంబుగా ప్రార్ధించెను.
నమస్తే వైకుంఠ శ్రీవత్స శుభాలాన్చన త్వన్నమ స్మరణా త్పాపమశేషం నఃప్రణశ్యతి, నమోనమస్తే గోవిందా నారాయణా జనార్దనా” యని ఇటుల అనేక విధములుగా స్తోత్రంచేసిణ అనంత పద్మనాభ స్వామి మిగుల సంతుష్టుడై “ఓ విప్రోత్తమా! నీవు చేసిన స్తోత్రంబుచే నేను ఎంతో సంతసించితిని. నేకు ఎల్లప్పటికిని దారిద్ర్యము సంభావించకున్డునటులను, అంత్యకాలమున శాశ్వత విశ్నులోకము గలుగునట్లు వరముఇచ్చితిని అనెను.
అప్పుడు కొందిన్యుడు ఆనందముతో ఇట్లనెను.
ఓ జగన్నాధా! నేను మార్ఘ మధ్యలో చూచిన ఆ మామిడి చెట్టు వృత్తాంతముఏమిటి? ఆ ఆవు ఎక్కడిది? ఆ వృషంభు ఎక్కడినుండి వచ్చెను? ఆ కొలను విశేషము ఏమిటి? ఆ గాడిద ఏనుగు, బ్రాహ్మనులు ఎవరు? అని ఆ భగవంతుడిని అడిగెను. అపుడు ఆ పరమాత్ముడు.
ఓ బ్రాహ్ణణ శ్రేష్టుడా! పూర్వము ఒకబ్రాహ్ణణుడు సకల విద్యలు నేర్చుకొని గర్వంబుచే ఎవ్వరికిని విద్య చెప్పక పోవుటచే అడవిలో ఎవరికి ఉపయోగపడని మామిడి చెట్టుగా జన్మించెను. ఒకడు మహా భాగ్యవంతుడై యుండి తన జీవిత కాలమునందు ఎన్నడునుబ్రాహ్ణణులకు అన్న ప్రదానము చేయనందున పశువుగా పుట్టి గడ్డి తిన నోరు ఆడక పచ్చి గడ్డిలో తిరుగుచున్నాడు. పూర్వము ఒక రాజు ధనమదాన్దుడై
బ్రాహ్ణణులకు చవితి భూమిని దానము జేసినందున ఆ రాజు వ్రుషభంబై అడవిలో తిరుగుచున్నాడు. ఆ కొలంకులు రెండును ఒకటి ధర్మమూ, మరియొకటి అధర్మము. ఒక మానవుడు సర్వదా పరులను దూశించుచూ నున్దినందున గాదిదయై పుట్టి తిరుగుచున్నాడు. పూర్వము ఒక పురుషుడు తన పెద్దలు చేసిన దానధర్మములను తానె విక్రయించి వెనకేసుకోనుటవలన అతడే ఏనుగుగా జన్మించెను. అనంత పద్మనాభుదనైన నేనేబ్రాహ్ణణ రూపముతో నీకు ప్రత్యక్షమైతిని. కావున నీవు ఈ వ్రతమును పదునాలుగు సంవత్సరములు ఆచరిన్చితివేని నీకు నక్షత్ర స్థానము ఇచ్చెదనని వచించి భగవంతుడు అంతర్దానము నొందేను.
పిదప కౌండిన్య ముని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన వృత్తాంత మంతయు జెప్పి పదునాలుగు సంవత్సరములు అనంత వ్రాతంబు నాచరించి ఇహలోకమున పుత్రపౌత్రాది సంపద అనుభవించి అంత్యకాలమున నక్షత్రమందలము చేరెను.
ఓ ధర్మరాజా! ఆ మహాత్ముండగు కౌండిన్యుడు నక్షత్ర మండలంబునండు కాన బడుచున్నాడు. మరియు అగస్త్య మహాముని ఈ వ్రాతంబు ఆచరించి లోకంబున ప్రసిద్ది పొందెను. సాగర, దిలీప, భారత, హరిశ్చంద్ర, జనక మహారాజు మొదలగు అనేక రాజులు ఈ వ్రతమును ఆచరించి ఇహలోకంబున రాజ్యముల ననుభవించి అంత్యంబున స్వర్గమును బొందిరి. కావున ఈ వ్రత కథను సంగము వినువారలు ఇహలోకంబున అష్టైశ్వర్యంబులు ననుభవించి స్వర్గలోక ప్రాప్తి పొందుదురు.

dharma sandehalu, hindu tradition, Lord Krishna, pooja room, pooja without pandit, vratham
కాలసర్ప దోష పరిహారములు | Remedies for Kala Sarpa Dosha
సంతాన గోపాల స్తోత్రం – Santana Gopala Stotram

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.