శ్రీ విళంబి నామ సంవత్సర ఆషాఢ శుక్ల పూర్ణిమ ది.. 27-07-2018 తేదీ శుక్రవారం కేతుగ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం.
ది. 27వ తేదీ జూలై 2018 , శ్రీ విళంబినామ సంవత్సర ఆషాఢ శుక్ల పౌర్ణమి నాడు మకర రాశి యందు రాత్రి 11:54 ని నుండి తెల్లవారుఝామున 3:55 ని వరకూ సంపూర్ణ చంద్ర గ్రహణం (Total Lunar Eclipse July 2018) ఏర్పడును. ఈ గ్రహణం భారత దేశమంతటా కనిపించును. ఐతే ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం ప్రారంభము తూర్పు ఆగ్నేయములందు స్పర్శను పొంది, వాయవ్యమందు నిమీలనమొంది, ఈశాన్యంలో ఉన్మీలనమై పశ్చిమమందు మోక్షము పొందును. కేతుగ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం యొక్క వర్ణము పింగళ వర్ణము.
జూలై 27, 2018 సంపూర్ణ చంద్రగ్రహణ సమయాలు |
|
చంద్రోదయకాలం(RJY): | రాత్రి 6గంటల 20 నిముషములు (IST) |
గ్రహణ స్పర్శకాలం: | రాత్రి 11గంటల 54 నిముషములు (IST) |
గ్రహణ నిమీలన కాలం: | రాత్రి 12గంటల 59 నిముషములు (IST) |
గ్రహణ మధ్య కాలం: | రాత్రి 1గంటల 51 నిముషములు (IST) |
గ్రహణ ఉన్మీలన కాలం: | రాత్రి 2గంటల 43 నిముషములు (IST) |
గ్రహణ మోక్ష కాలం: | రాత్రి 3గంటల 49 నిముషములు (IST) |
గ్రహణ పుణ్య కాలం 3గంటల 55 నిముషములు | |
బింబదర్శన కాలం 1గంట 44 నిముషములు |